కర్నాటక రాష్ట్రంలోని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న కేసులో సరికొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడుతో సహజీవనం చేస్తూనే మరో యువకుడుతో ప్రేమించింది. ప్రియుడుకి ఆ యువతి మరో యువకుడుతో సహజీవనం చేస్తున్న విషయం తెల్సింది. దీంతో ప్రియుడు ఆమెను పట్టించుకోవడం మానేశాడు. ప్రియుడు దూరం పెట్టడంతో ఆమె జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు..
కర్నాటక రాష్ట్రంలోని హడగలి తాలూకా మదలగట్టె సమీపం తుంగభద్ర నదిలో దూకి జ్యోతి (25) అనే ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్య వెనుక ఇద్దరు యువకులు ఉన్నారని పోలీసులు గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. ఆమె మృతదేహాన్ని సోమవారం రాత్రి అదే నదిలోంచి వెలికితీశారు.
ఆరు నెలల క్రితం ఆమెకు అదే ప్రాంతానికి చెందిన బసవరాజ్ అనే యువకుడితో పరిచయమై, సన్నిహితంగా మారడంతో అతనితో కలిసి సహజీవనం సాగిస్తుండేది. ఇటీవల తన ప్రియుడు బసవరాజ్ ప్రవర్తనలో మార్పు రావడం, ఆమెను పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది.
యువకుడితో తన పరిచయం, సహజీవనం తర్వాత అతని ప్రవర్తనలో మార్పు, తదితర ఆంశాలతో కూడిన ఉత్తరం రాసి డైరీలో పెట్టి, ఈ నెల 27న మదలగట్టె తుంగభద్ర నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె రాసిన ఉత్తరం ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టిన హడగలి పోలీసులు బసవరాజ్, అతని స్నేహితుడు శివకుమార్ను అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నారు.