పరీక్షా ఫలితాలు వస్తే చాలు, ఫెయిల్ అయిన కొందరు విద్యార్థులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. మరికొందరు తను ఫెయిలయ్యాననే బాధతో ఆత్మహత్యా యత్నాలకు పాల్పడుతున్నారు. ఈ రోజు ఇంటర్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో ఫెయిలయ్యానన్న మనస్తాపంతో ఓ విద్యార్థి కళాశాల భవనం పైనుంచి దూకేసాడు.
ఈరోజు విడుదలైన ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా కేవలం 61 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. దీనితో 39 శాతం మంది ఫెయిలయ్యారు. మూల్యంకన విధానం చాలా కఠినంగా వుండటం వల్లే ఇలా జరిగిందని కొందరంటుంటే... కరోనా నేపధ్యంలో ఆల్ పాస్ చేస్తారన్న ధీమాతో చాలామంది విద్యార్థులు పుస్తకాల జోలికే వెళ్లలేదనే వాదన కూడా వినిపిస్తోంది.