బాలికకు మాయమాటలు చెప్పి ప్రత్యేక శిక్షణ పేరుతో అత్యాచారం.. బ్యాడ్మింటన్ కోచ్ అరెస్టు!!

ఠాగూర్

సోమవారం, 7 ఏప్రియల్ 2025 (10:58 IST)
ఓ బ్యాడ్మింటన్ కోచ్ తన వద్దకు వచ్చిన బాలికలకు మాయమాటలు చెప్పి ప్రత్యేక శిక్షణ పేరుతో అత్యాచారం చేసిన ఘటన కర్నాటక రాష్ట్రంలోని బెంగుళూరు నగరంలో వెలుగు చూసింది. ఈ విషయం తెలుసుకున్న ఓ బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హుళిమావు పోలీసులు కేసు నమోదుచేసి కోచ్ సురేశ్ బాలాజీని అరెస్టు చేశారు. 
 
పోలీసుల కథనంమేరకు.. తమిళనాడు రాష్ట్రానికి సురేశ్ బాలాజీ ఓ బ్యాడ్మింటన్ కోచ్‌గా అనేక మంది బాలికలు శిక్షణ ఇస్తున్నాడు. ఈ క్రమంలో ఓ బాలిక గత రెండేళ్లుగా అతని వద్దకు శిక్షణకు వెళుతోంది. ఆ బాలికకు మాయమాటలు చెప్పిన కోచ్.. ఆపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడుతూ నగ్న ఫోటోలు వీడియోలు తీసేవాడు. 
 
అయితే, ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో ఆ బాలిక తన అమ్మమ్మ ఇంటికి వచ్చింది. అక్కడి నుంచి కూడా తనకు నగ్నఫోటోలు పంపాలని బాలికపై కోచ్ ఒత్తిడి చేశాడు. దీంతో అమ్మమ్మ మొబైల్ నుంచి తన న్యూడ్ ఫోటోలను కోచ్‌కు పంపించింది. తన మొబైల్ ఫోనులో బాలిక న్యూడ్ ఫోటోలు ఉండటాన్ని గమనించిన అమ్మమ్మ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది.
 
పిమ్మట బాలిక వద్ద తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయాన్ని వెల్లడించింది. ప్రత్యేక శిక్షణ పేరుతో కోచ్ పలుమార్లు అపార్టుమెంట్‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దంటూ బెదిరించాడని తెలిపింది. దీనిపై బాధిత బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సురేశ్ బాలాజీని అరెస్టు చేశారు. అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతని ఫోనును పరిశీలించగా, మొబైల్‌లో మరో ఎనిమిది మంది బాలికల న్యూడ్ ఫోటోలను పోలీసులు గుర్తించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు