హోటల్ గదిలో సినీ నటిపై అత్యాచారం చేసిన ఇన్‌స్టాగ్రాం ఫాలోవర్

శుక్రవారం, 21 జులై 2023 (11:18 IST)
సినీ హీరోయిన్లకు సోషల్ మీడియాలో భారీగా అభిమానులు, ఫాలోవర్లు వుంటుంటారు. వీరిలో కొందరు వీరాభిమానులు, సెలబ్రిటీల నమ్మకాన్ని గెలుచుకునేవారు కూడా వుంటారు. అలాంటివారితో కొన్నిసార్లు సమస్యలు వస్తాయి. తన ఇన్‌స్టాగ్రాం ఫాలోవర్ మాటలను నమ్మి వెళ్లిన భోజ్ పురి సినీ నటి అతడి కామదాహానికి బలైపోయింది.
 
పూర్తి వివరాలను పరిశీలిస్తే... తనకు ఇంటర్వ్యూ కావాలంటూ భోజ్ పురి హీరోయిన్ ను నమ్మించి హోటల్ గదికి రప్పించాడు ఆమె ఇన్ స్టాగ్రాం ఫాలోవర్. తనకు ఇండస్ట్రీలో చాలామంది తెలుసునని, ఇంటర్వ్యూ చేసి అవకాశాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. అతడి మాటలను నమ్మిన నటి గురుగ్రాంలోని ఉద్యోయ్ విహార్ ప్రాంతంలో వున్న ఓ నక్షత్ర హోటలుకి రమ్మనగానే వెళ్లింది.
 
అక్కడ ఆమెతో మాట్లాడుతూ... మధ్యలో మద్యం సేవించడం ప్రారంభించాడు. అతడి వ్యవహారశైలి అనుమానస్పదంగా వుండటంతో నటి అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించింది. ఐతే ఆమెను బలవంతంగా లాగి గదిలో బంధించి అత్యాచారం చేసాడు. విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. ప్రైవేట్ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ తన స్నేహితుల ద్వారా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు