అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యే బహిష్కరణ

శనివారం, 23 డిశెంబరు 2023 (18:08 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన అధికార బీజేపీ ఎమ్మెల్యేను ఆ రాష్ట్ర అసెంబ్లీ నుంచి బహిష్కరించారు. అత్యాచారం కేసులో కోర్టు జైలుశిక్ష విధించడంతో బీజేపీ ఎమ్మెల్యే రాందులర్ గోండ్‌పై ఈ చర్య తీసుకున్నారు. ఈయన గత 2014లో మైనర్ బాలికపై అత్యాచారం చేసినట్టు రుజువు కావడంతో 25 యేళ్ల జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 
 
సోన్‌భద్ర జిల్లాలోని దుద్ది అసెంబ్లీ స్థానం నుంచి గోండ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సోన్‌భద్రలోని ఎంపీ - ఎమ్మెల్యే కోర్టు అదనపు జిల్లా సెషన్ జడ్జి అహ్సాన్ ఉల్లా ఖాన్ తాజాగా తీర్పును వెలువరించారు. ఈ కేసులో దోషి అయిన గోండుకు రూ.10 లక్షల జరిమానాను కూడా కోర్టు విధించింది. 
 
ఈ మొత్తాన్ని అత్యాచార బాధితురాలికి అప్పగించాలని ఆదేశించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులు ఐపీసీ 376, 506, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయగా, పోలీసులు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన కోర్టు ఎమ్మెల్యేను దోషిగా తేల్చి పాతికేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. దీంతో ఆయనను అసెంబ్లీ నుంచి బహిష్కరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు