ఈ వివరాలను పరిశీలిస్తే, సికింద్రాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఫేస్‌బుక్ ఖాతాకు అందమైన అమ్మాయి ముఖచిత్రంతో ఉన్న ఖాతా నుంచి మిత్ర విజ్ఞప్తి (ఫ్రెండ్ రిక్వెస్ట్) రావడంతో అంగీకరించాడు. తాను ఏపీలోని గుంటూరులో ఉంటానని, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నానంటూ వివరాలను చెప్పింది.
మరోవైపు, తనకు అత్యవసరంగా డబ్బులు అవసరమని చెప్పడంతో విడతల వారీగా రూ.95 లక్షలు ఆమెకు ముట్టజెప్పాడు. అనంతరం ఆ అమ్మాయి ఫేస్‌బుక్ ఖాతా డిలీట్ అయింది. ఫోన్‌లోనూ అందుబాటులో లేకుండా పోయింది. తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.