వివరాలు ఇలా వున్నాయి. తెలంగాణ లోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలో సాంఘిక సంక్షేమ కళాశాలలో ఓ మహిళ లెక్చరర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో విద్యార్థులందరికీ రీడింగ్ అవర్ వుండటంతో ఆమె ఇంచార్జి వ్యక్తితో మాట్లాడేందుకు అతడి గదిలోకి వెళ్లింది. ఆ తర్వాత సహచర ఉపాధ్యాయుడు పక్క గదిలో నుంచి సదరు లేడీ లెక్చరర్ ఇంచార్జితో సన్నిహితంగా వుండటాన్ని చూసి వీడియో తీసాడు.
ఆ వీడియోను చూపి ఆమెను నిలదీశాడు. దీనితో తన పరువు పోతుందని గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఐతే సదరు ఉపాధ్యాయుడు మహిళా లెక్చరర్ వీడియోను చూపించి బ్లాక్ మెయిల్ చేసాడనీ, తన కోర్కె తీర్చాలనీ, లేదంటే వీడియో బయటపెడతానంటూ బెదిరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అతడి లైంగిక వేధింపులు, బెదిరింపులు తాళలేక సదరు లెక్చరర్ ఆత్మహత్య చేసుకున్నట్లు చెపుతున్నారు.