అస్సాం రాష్ట్ర రాజధాని గౌహతికి సమీపంలోని సత్‌గావ్‌లో ఓ దారుణం జరిగింది. మూగ మహిళ, ఆమె కుమార్తెపై ఎనిమిది మంది కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి ప్రైవేటు భాగాలపై కారం చల్లారు. ఈ హృదయ విదారక ఘటన గత మే నెలలో జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నలుగురు కామాంధులను అరెస్టు చేసి జైలుకు పంపించారు. పరారీలో ఉన్న మరో నలుగురి కోసం గాలిస్తున్నారు.
మే 17వ తేదీ రాత్రి సత్‌గావ్‌కు చెందిన అమిత్ ప్రధాన్, అతడి సహచరులు బాధితురాలి ఇంట్లోకి ప్రవేశించి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితురాళ్లు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోగా.. సత్‌గావ్ పోలీసులకు ఇరుగుపొరుగు వారు సమాచారం అందించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇద్దరినీ గౌహతి వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు.
గిరిజన కూలీపై మూత్రవిసర్జన చేసిన వ్యక్తి అరెస్టు..
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సిధి జిల్లాలో ఓ గిరిజన కూలీపై మూత్రవిసర్జన చేసిన వ్యక్తిని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించారు. అలాగే, ఎస్సీ, ఎస్టీ సెక్షన్లపై కేసులు నమోదు చేశారు. ఈ వ్యక్తిని బీజేపీ ఎమ్మెల్యే కేదార్ శుక్ల ప్రతినిధి కావడం గమనార్హం.
సిధి జిల్లాలో పర్వేశ్ శుక్లా అనే వ్యక్తి ఓ గిరిజన కూలీపై మూత్ర విసర్జన చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తక్షణం చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన ఎంపీ పోలీసులు.. పర్వేష్ శుక్లాను అరెస్టు చేసి జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించారు.
ఎస్సీ ఎస్టీ సహా పలు సెక్షన్ల కింద్ కేసు నమోదు చేశారు. నిందితుడు బీజేపీ ఎమ్మెల్యే కేదార్ శుక్లా ప్రతినిధి అని, అందుకే ఆయనపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు వెనుకాడుతున్నారంటూ విపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. పైగా, ఎమ్మెల్యేతో నిందితుడు ఉన్న ఫోటోలను షేర్ చేశారు.
అయికే, కేదార్ శుక్లా ఈ ఆరోపణలను ఖండించారు. అతడు తనకు ప్రతినిధఇ కాదని కాకపోతే అతడు తనకు తెలుసని వివరణ ఇచ్చాడు. నిందితుడు పర్వేష్ శుక్లా తండ్రి రమాకాంత్ శుక్లా మాత్రం తన కుమారుడు ఎమ్మెల్యే కేదార్ శుక్లా ప్రతినిధేనని, అందుకే ఆయన్ను టార్గెట్ చేశారని వ్యాఖ్యానించడం గమనార్హం.