ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రపుర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. ఈయన ఇంటిలో ఓ జవాను రెండు నెలల క్రితం తన భార్యతో కలిసి అద్దెకు దిగాడు. ఈ నెల 15వ తేదీన నిందితుడి కుటుంబ సభ్యులంతా బంధువుల ఇంటికి వెళ్లారు. ఆసమయంలో జవాను కూడా విధులకు వెళ్లాడు. దీంతో ఆయన ఇంట్లో జవాను భార్య ఒక్కరే ఉన్నారు. ఇదే అదనుగా భావించిన ఇంటి యజమాని లైంగికదాడికి యత్నించాడు.
ఆసమయంలో జవాను భార్య.. తన కుటుంబ సభ్యులతో వీడియో కాల్‌లో మాట్లాడుతోంది. యజమాని వచ్చి తనపై లైంగికదాడికి యత్నించడం వీడియో కాల్‌లో వారి కంట పడింది. వారు వెంటనే పోలీసులకు, బాధితురాలి భార్యకు సమాచారం అందించారు. వెంటనే వారు వచ్చిన ఆమెను రక్షించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.