హైదరాబాద్ నగర శివార్లలో 23 ఏళ్ల మానసిక వికలాంగురాలిపై ఒక వ్యక్తి, అతని మైనర్ కుమారుడు అత్యాచారం చేశారు. ఈ అకృత్యంతో ఆమె గర్భం దాల్చారని ఆరోపణలు ఉన్నాయి. వివరాల్లోకి వెళితే... తండ్రిని కోల్పోయిన ఆ మహిళ తన తల్లితో నివసిస్తోంది.
బాధితురాలికి తెలిసిన, అదే ప్రాంతానికి చెందిన అనుమానితులు ఆమెపై లైంగిక వేధింపులకు గురిచేశారు. గత కొన్ని నెలలుగా ఆ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు, తండ్రి కొడుకులు ఆమెపై పదేపదే లైంగిక దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.