వివాహేతర సంబంధం నిండు జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. కర్నూలు జిల్లాలో జరిగిన ఘటన సంచలనంగా మారింది. ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ గ్రామం. రామయ్య- జయలక్ష్మి ఇద్దరు భార్యాభర్తలు. పెళ్లయి కూతురు, కుమారుడు కూడా ఉన్నారు. పిల్లాపాపలతో వారి జీవితం సుఖంగా సాగుతోంది.
ఈ ఘోరాన్ని కూతురు, కుమారుడు కళ్లారా చూసి బంధువులకు తెలిపారు. ఇక హత్య అనంతరం ప్రియుడి సాయంతో భర్త శవాన్ని హంద్రీనీవా కాలువలో పడేసింది. ఇంతటితో ఆగకుండా భర్త కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ప్లాన్ వేసిన ప్రియుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.