అత్యాచారం కేసులో జైలు నుంచి విడుదలై సంబరాలు చేసుకున్న నిందితులు!!

ఠాగూర్

శుక్రవారం, 23 మే 2025 (15:52 IST)
అత్యాచారం కేసులో కొందరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని రోజుల పాటు నిందితులంతా జైలు జీవితాన్ని గడిపారు. ఇపుడు బెయిలుపై విడుదలయ్యారు. తామోదో ఘనకార్యం చేసి జైలుకెళ్లి విడుదలైనట్టుగా భావించిన ఆ కామాధులు.. ఓపెన్ టాప్ కారులో ఊరేగుతూ సంబరాలు జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
కర్నాటక రాష్ట్రంలోని హవేరిలో ఓ యువతిపై లైంగికదాడికి తెగబడినందుకుగాను అఫ్తాబ్, మదర్ సాబ్, సమీవుల్లా, మొహ్మద్ సాధిక్, తౌసీఫ్, రియాజ్, షోయబ్‌లను ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. వీరికి కర్నాటక రాష్ట్రంలోని హవేరి కోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసింది. దీంతో జైలు నుంచి విడుదలయ్యారు.
 
నిజానికి ఈ కామాంధులు చేసిన పనికి తలదించుకోవాల్సి వుంది. కానీ, తామేదో ఘనకార్యం చేసినట్టుగా భావించి సంబరాలు జరుపుకోవడం చూస్తుంటే మరోవారు ఆడబిడ్డ దొరికితే ఈ కామాంధులు వదిలిపెడతారా? అనే సందేహం కలుగుతోంది. ఇంకో ఆడపిల్లను అత్యాచారం చేసినా మహా అయితే జైలు, కోర్టు బెయిల్. ఆ తర్వాత ఇలాగే సంబరాలు జరుపుకుంటారని పలు మహిళా సంఘాల ప్రతినిధులు  వాపోతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు