Rainfall: బెంగళూరులో భారీ వర్షాలు.. నీట మునిగిన నివాస ప్రాంతాలు

సెల్వి

సోమవారం, 19 మే 2025 (13:41 IST)
Bengaluru
బెంగళూరులో ఆరు గంటలకు పైగా అంతరాయం లేకుండా కురిసిన భారీ వర్షం కారణంగా బెంగళూరు నగరం అంతటా నీట మునిగింది. లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. నివాస ప్రాంతాలు చిన్న సరస్సుల వలె కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు నగరంలో నమోదైన అత్యధిక వర్షపాతం ఇదేనని తెలుస్తోంది. 
 
వర్షపు ప్రభావాన్ని చూపించే వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చక్కర్లు కొడుతున్నాయి.  సిల్క్ బోర్డ్ జంక్షన్, హెచ్ఆర్‌బీఆర్ లేఅవుట్- బొమ్మనహళ్లితో సహా అనేక కీలక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇంతలో, భారత వాతావరణ శాఖ (IMD) గురువారం వరకు బెంగళూరులో భారీ వర్షపాతం ఉంటుందని అంచనా వేసింది. వాసితులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
 
కర్ణాటక రాష్ట్ర విపత్తు పర్యవేక్షణ కేంద్రం కెంగేరిలో అత్యధికంగా 132 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని పేర్కొంది. దీని తర్వాత ఉత్తర బెంగళూరులోని వడ్దరహళ్లి 131.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో రాత్రిపూట 100 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు