లేడీ డాన్ జిక్రా ఎవరు?
ఢిల్లీలోని సీలంపూర్‌కు చెందిన యువతి జిక్రా. ఈమె గతంలో గ్యాంగ్‌స్టర్ హషీమ్ బాబా భార్య జోయాకు బౌన్సరుగా పనిచేసేది. మాదక ద్రవ్యాల కేసులో జోయాను పోలీసులు అరెస్ట్ చేయడంతో జిక్రా తన సొంత గ్యాంగును ఏర్పాటు చేసుకున్నది. ఈ గ్యాంగులో 12 మంది దాకా సభ్యులుండేవారు. ఆమధ్య తన చేతిలో తుపాకి పట్టుకుని వున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆమెను అరెస్ట్ చేసారు. 15 రోజుల కిందట బెయిల్ పైన బైటకు వచ్చింది. ఈ క్రమంలో మృతుడు కునాల్ ఇంటికి సమీపంలో అద్దెకి దిగింది.
ఆమెను, ఆమె గ్యాంగ్‌ను చూసి భయపడిపోయిన కొంతమంది అక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు వాదనలు కూడా వున్నాయి. మరోవైపు తన సోదరుడు వరసైన సాహిల్ పైన ఇటీవలే హత్యాయత్నం జరిగింది. ఈ కుట్రలో కునాల్ హస్తం వున్నదన్న అనుమానంతో అతడిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు లోతుగా జరుపుతున్నట్లు పోలీసులు తెలియజేసారు.