మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా జిల్లా మౌగండ్ ప్రాంతంలోని ధేరా గ్రామానికి చెందిన 24 యేళ్ల పంకజ్ అదే ప్రాంతానికి చెందిన 19 యేళ్ళ యువతిని గత కొంతకాలంగా ప్రేమిస్తూ వస్తున్నాడు. ప్రేమకు ఫుల్‌స్టాఫ్ పెట్టి తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతి ప్రియుడిపై ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన అతను... ఆమెను నడిరోడ్డుపై కిందపడేసి చావబాదాడు. ఈ ఘటన గత బుధవారం జరగ్గా ఆదివారం వెలుగులోకి వచ్చింది.