మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. తీవ్ర రక్తస్రావంతో మృతి

గురువారం, 17 ఆగస్టు 2023 (15:57 IST)
తెలంగాణ రాష్ట్రంలో దారుణం జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి రాష్ట్రానికి వలస వచ్చిన 16 యేళ్ళ మైనర్ బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. ఆ తర్వాత ఆ బాలిక తీవ్ర రక్తస్రావానికి గురికావడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
మధ్యప్రదేశ్ నుంచి వలస వచ్చిన ఇతర కార్మికులు తెలిపిన సమాచారం మేరకు సదరు బాలిక నిర్మాణ రంగంలో పని చేయడం కోసం వచ్చి పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలోని శివపార్వతి నగరులో తన అక్కాబావలతో కలిసి ఉంటోంది. ఆగస్టు 14వ తేదీన మధ్యాహ్నం కూలీ డబ్బులు ఇస్తానని మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన కాంట్రాక్టర్ పెద్దపల్లి శివారు ప్రాంతంలో మరో ముగ్గురితో కలిసి అత్యాచారం చేసినట్లు సమాచారం. 
 
ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని బాలికను హెచ్చరించినట్లు తెలిసింది. రక్తస్రావంతో బాలిక తీవ్ర అస్వస్థతకు గురవడంతో మర్నాడు ఉదయమే సంబంధిత కాంట్రాక్టర్ ఆమె కుటుంబసభ్యులను స్వస్థలమైన మధ్యప్రదేశ్ రాష్ట్రం బాలాఘాట్ జిల్లా కజిరి గ్రామానికి ఓ వాహనంలో పంపించాడు. 
 
అయితే, ఆ బాలిక మార్గం మధ్యలో అధిక రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం ఎవరికీ తెలియ కుండా సదరు కాంట్రాక్టర్ జాగ్రత్త పడినా, ఫోన్ ద్వారా విషయం తెలుసుకున్న తోటి వలస కూలీలు అధికారులకు సమాచారం అందించారు. దీనిపై అధికారులు, పోలీసులు కలిసి ఆరా తీస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు