తండ్రి బాగా సంపాదించాడు. ఒకే ఒక్క కూతురు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నాడు. కాలేజీకి కారులో పంపించేవాడు. ఏ లోటు రాకుండా చూసుకునేవాడు. అయితే యువతి మాత్రం కారు డ్రైవర్‌ను ప్రేమించింది. అతనే సర్వస్వం అనుకుంది. తల్లిదండ్రులకు చెప్పకుండా వివాహం చేసుకుంది. అప్పటికే ఆ కారు డ్రైవర్‌కు పెళ్ళయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా సరే రెండో భార్యగా ఉంటానంటోంది యువతి.
ఈ క్రమంలో రంజిత్ కుమార్తెతో అతనికి పరిచయం ఏర్పడింది. కారులోనే కాదు అప్పుడప్పుడు బైక్ పైనా కాలేజీలో వదిలిపెట్టేవాడు. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఒకరకంగా ట్రాప్ చేసి ఆమెను లైన్లో పెట్టాడు. అంతటితో ఆగలేదు. తీసుకెళ్ళి పెళ్ళి చేసేసుకున్నాడు. ఇంకేముంది తల్లిదండ్రులు పరుగును వచ్చారు. ఎందుకిలా చేశావంటూ కుమార్తెను ప్రశ్నించారు.