ధోనాపాల్ గ్రామానికి చెందిన హిమాన్షు (55) ఆటో డ్రైవర్. మద్యానికి బానిసై ఇంట్లో గొడవపడటంతో భార్యా పిల్లలు చాలా కాలంగా విడిగా ఉంటున్నారు. కాగా, మంగళవారం రాత్రి హిమాన్షు పీకలవరకు మద్యం తాగి ఇంటికి చ్చాడు. వృద్ధ తల్లిదండ్రులైన హదిబంధు సాహు (81), శాంతి సాహు (72)తో గొడవపడ్డాడు. ఆ తర్వాత ఆగ్రహంతో వారిపై సుత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వృద్ధ దంపతులు అక్కడే చనిపోయారు. మద్యం మత్తు తలకెక్కడంతో ఆ కిరాతక కొడుకు రాత్రంతా మృతదేహాల వద్దనే నిద్రపోయాడు.