ఆన్‌లైన్ ఆర్డర్ బాక్సు తెరవగానే పేలిపోయింది, ఇద్దరు మృతి

ఐవీఆర్

గురువారం, 2 మే 2024 (16:14 IST)
గుజరాత్ రాష్ట్రంలోని సబర్‌కాంతలోని వడాలిలో ఆన్ లైన్ ఆర్డర్ ద్వారా వచ్చిన ఓ పార్శిల్‌ తెరవగానే పేలుడు సంభవించిన ఘటన వెలుగు చూసింది. వడాలిలోని ఓ కుటుంబం ఎలక్ట్రానిక్ వస్తువుల పార్శిల్ ఆర్డర్ చేసింది. పార్శిల్‌ను తెరవగానే భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 11 ఏళ్ల బాలిక, 30 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. ఇద్దరి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
 
ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ పార్శిల్ వంజర జితేంద్రభాయ్ పేరు మీద వచ్చింది. ఇంటికి చేరుకోగానే కుటుంబ సభ్యులు పార్శిల్ తెరిచారు. ఆపై ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఎలక్ట్రానిక్ వస్తువుల పార్శిల్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై గ్రామస్తుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
 
ఒక రిక్షా పుల్లర్ వచ్చి ఇదిగో మీ పార్శిల్ ఎవరో నాకు ఇస్తే మీకు ఇస్తున్నానని చెప్పాడు. అనంతరం పార్శిల్‌ను తెరుస్తుండగా పేలుడు సంభవించింది. ఇందులో మంజూర్ హుస్సేన్ పిర్జాదా, 11 ఏళ్ల బాలిక చనిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పార్శిల్‌లో ఎలాంటి పేలుడు పదార్థాలున్నాయన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు