కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

ఐవీఆర్

బుధవారం, 21 మే 2025 (18:39 IST)
దక్షిణ బెంగళూరు రైల్వే ట్రాక్ సమీపంలో ఓ సూట్‌కేస్ పడి వుంది. ఆ సూట్‌కేస్‌ను తెరిచి చూడగా అందులో 18 ఏళ్ల టీనేజ్ యువతి శవం వుంది. కదులుతున్న రైల్లో నుంచి శవంతో వున్న ఆ సూట్‌కేస్‌ని విసిరేసి వుంటారని భావిస్తున్నారు.
 
ఈ రైల్వే ట్రాక్ హోసూరు ప్రధాన రోడ్డుకి సమీపంలో వున్నది. యువతిని ఎక్కడో హత్య చేసి తీసుకుని వచ్చి ఇక్కడ పడవేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సూర్యనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సూట్‌కేస్ లోపల ఎటువంటి ఆధారాలు లభించలేదు. యువతికి 18 ఏళ్ల వయసు వుండవచ్చని చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు