ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధాలు..! (Video)

ఠాగూర్

గురువారం, 26 డిశెంబరు 2024 (09:46 IST)
తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డిలో వివాహేతర సంబంధం ముగ్గురి ప్రాణాలు తీసింది. మహిళా కానిస్టేబుల్ శృతికి, పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ సాయి కుమార్‌కు మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. వీరిద్దరికి కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తే నిఖిల మధ్యవర్తిత్వం వహిస్తున్నాడు. ఈ ముగ్గురు అడ్లూరు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మూడు మృతదేహాలను గుజ ఈతగాళ్లు గురువారం వెలికి తీశారు. 
 
కానిస్టేబుల్ శృతితో ఎస్ఐ సాయికుమార్ వివాహేతర సంబంధమే ఘటనకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ణయించారు. కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్.. ఎస్సైకి, కానిస్టేబుల్ శృతికి మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు పోలీసుల అనుమానిస్తున్నారు. అయితే.. ఈ ముగ్గురు చెరువులో పడి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. కాగా, ఎస్ఐ సాయికుమార్‌కు పెళ్లయి అప్పటికే ఇద్దరు పిల్లలు.. కాగా, శృతికి పెళ్లయి విడాకులు అయినట్లు తెలుస్తోంది. 

 

ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధాలు..!

ఎస్సై సాయికుమార్ మృతదేహాన్ని సైతం వెలికితీసిన గజ ఈతగాళ్లు

కానిస్టేబుల్ శృతితో ఎస్సై సాయికుమార్ వివాహేతర సంబంధమే ఘటనకు కారణమని ప్రాథమిక సమాచారం

కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్.. ఎస్సైకి, కానిస్టేబుల్ శృతికి మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు పోలీసుల… https://t.co/4Wo4jdguvQ pic.twitter.com/JfzKL6ZEpy

— BIG TV Breaking News (@bigtvtelugu) December 26, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు