ఉత్తరాఖండ్ సరిహద్దు ఉత్తరప్రదేశ్‌లోని బిలాస్‌పూర్ పట్టణంలో 33 ఏళ్లున్న వయసున్న ఓ మహిళ తన 11 ఏళ్ల కుమార్తెతో కలిసి అద్దె గదిలో ఉంటోంది. ఈ క్రమంలో జులై 30న తాను పనిచేస్తున్న రుద్రాపుర్‌లోని ఆసుపత్రి నుంచి తన విధులు నిర్వహించుకొని రాత్రిపూట ఇంటికి బయలుదేరింది. అయితే ఆమె ఇంటికి రాకపోవడంతో ఆమె సోదరి రుద్రాపుర్ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఎనిమిది రోజుల తర్వాత ఆగస్టు 8న తన అపార్టుమెంట్ సమీపంలోని పొదల్లో మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని శవపరీక్షకు పంపించగా ఆమెపై అత్యాచారం జరిగినట్లు వెల్లడైంది.
ఈ ఘటనకు సంబంధించి రుద్రాపుర్ పోలీసులు నిందితుడు ధర్మేంద్రను అరెస్టు చేశారు. అతడిని విచారించగా నిజం ఒప్పుకున్నాడు. బాధితురాలిని అనుసరించిన నిందితుడు.. ఆమె అపార్టుమెంట్‌కు సమీపంలోని ఏకాంత ప్రదేశంలో దాడి చేశాడు. మెడకు చున్నీ బిగించి, రాళ్లతో ఆమె ముఖంపై తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం అత్యాచారం చేసి చెట్ల పొదల్లోకి లాక్కెళ్లాడు. అనంతరం బాధితురాలి మొబైల్ ఫోన్, నగలు, డబ్బుతో పారిపోయాడు. ఆమె ఫోన్‌ను ట్రేస్ చేసిన పోలీసులు.. నిందితుడు రాజస్థాన్‌లో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లి అరెస్టు చేశారు. ే