భర్త మొబైల్ ఫోన్ ఇవ్వలేదన్న మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం యాకర్లకుంటపల్లిలో ఈ ఘన చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.... మహారాష్ట్రకు చెందిన సుధీర్ కట్కర్‌కు నీమా కట్కర్ (18) అనే యువతితో ఆరు నెలల క్రితం వివాహమైంది. ఆ తర్వాత ఈ దంపతులు బొగ్గులు కాల్చే పని కోసం ముదిగుబ్బకు వలస వచ్చారు.
ఆదివారం సాయంత్రం భర్త సుధీర్ గట్కర్‌ను మొబైల్ ఫోన్ ఇవ్వాలని భార్య కోరింది. అయితే, సెల్‌లో చార్జింగ్ లేదంటూ మొబైల్ ఫోన్ ఇవ్వకుండా భార్యతో వాగ్వాదం చేసి బయటకు వెళ్లిపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన నీమా తాము నివసించే గుడిసె సమీపంలో చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది.