మా అమ్మాయిని వేధిస్తారా? అని అడిగినందుకు ఒంగోలులో చచ్చేట్లు కొడుతున్న గంజాయి బ్యాచ్ (Video)

ఐవీఆర్

సోమవారం, 3 జూన్ 2024 (11:48 IST)
రాష్ట్రంలో గంజాయి బ్యాచ్ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. నేరాలు కూడా అదేస్థాయిలో పెచ్చరిల్లిపోతున్నాయి. ఒంగోలులో అమ్మాయిని వేధిస్తారా అన్నందుకు ఓ యువకుడిని గంజాయి సేవించే గ్యాంగ్ ఒకటి చితక బాదిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
ఈ వీడియోలో బాధితుడిని బైకు పై నుంచి కింద పడేసిన కొందరు యువకులు కర్రలతో గొడ్డును బాదినట్లు బాదుతున్నారు. తమనే నిలదీస్తావా అంటూ బూతులు తిడుతూ కాళ్లతో తన్నుతో నడిరోడ్డుపై కర్రలతో చావబాదుతున్నారు. ఈ ఘటన ఒంగోలులోని శర్మ కాలేజి ఎదుట జరిగినట్లు వీడియోలో చెప్పబడింది.

మేము మనిషి జన్మ ఎత్తాం అనుకునే వాళ్ళంతా పోలిస్ అఫిషియల్స్ కి టాగ్ చేయండి.

మా అమ్మాయిని వేధిస్తారా అని అడిగినందుకు చచ్చేలా కొడుతున్నారు.. దేవా అనే యువకుడ్ని
ఒంగోలు శర్మ కాలేజి ఎదుట ఈ గంజాయి బ్యాచ్ చితకబాదారు.@APPOLICE100 @ECISVEEPpic.twitter.com/zxtePapck4

— సుజత్(@Kadirodu) June 3, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు