సైబర్ క్రిమినల్స్ కోసం ఓ ఫ్రీ క్రిక్: భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన సెలబ్రిటీ అధ్యయనం 2020
మంగళవారం, 6 అక్టోబరు 2020 (21:28 IST)
అంతర్జాతీయంగా ఫుట్‌బాల్ అద్భుతం. పోర్చుగ్రీస్ ఆటగాడు క్రిస్టినో రోనాల్డో, మెకాఫీ యొక్క ‘భారతదేశంలో 2020వ సంవత్సరపు ఆన్‌లైన్ కోసం వెదుకులాటలో అత్యంత ప్రమాదకరమైన సెలబ్రిటీ జాబితా’లో అగ్రస్ధానంలో నిలిచారు. వరుసగా 14వ సంవత్సరం, మెకాఫీ సుప్రసిద్ధ పేర్లతో సృష్టించబడిన అత్యంత ప్రమాదకరమైన సెర్చ్ ఫలితాలతో మిళితమై, వినియోగదారుల ఉపకరణాలలో తెలియకుండానే ఇన్‌స్టాల్ అయ్యే మాల్‌వేర్ గురించి పరిశోధించింది.
రోనాల్డో అత్యంత ప్రమాదకరమైన సెలబ్రిటీగా 2019లో నిలిచారు. రియల్ మాడ్రిడ్ నుంచి జువెంటస్‌కు 105 మిలియన్ పౌండ్లకు అతను బదిలీ అయ్యాడని ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వార్తల కారణంగా అతను 2020లో నెంబర్ 1 స్థానానికి చేరుకున్నాడు. ఈ సంవత్సరం యుఈఎఫ్‌ఏ చాంఫియన్ లీగ్‌లో అందరి కళ్లూ అతనిపైనే ఉండటంతో, ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ ప్రేమికుల దృష్టిని ఆకర్షించారు.
తన ఫుట్‌బాల్ నైపుణ్యంతో మాత్రమే రొనాల్డో యొక్క ప్రజాదరణ వృద్ధి చెందడం కాదు, అతని జీవనశైలి, బ్రాండ్ ప్రచారాలు, చెవి రింగులు, సోషల్ మీడియా చురుకుదనం కూడా కారణమే. ఆశ్చర్యకరంగా, అభిమానులు అతని వ్యక్తిగత జీవితం గురించి స్ధిరంగా వెదుకుతూనే ఉంటారు. అతని బాల్యం, తల్లిదండ్రులు వంటి విషయాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంది. మెకాఫీ యొక్క అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం, అత్యధికంగా వెదికిన సాకర్ స్టార్‌గా మాత్రమే కాదు, 2020లో వెదికేందుకు అత్యంత ప్రమాదకరమైన సెలబ్రిటీగానూ నిలిచారు. ఆయన పేరుతోనే ఆన్‌లైన్‌లో అత్యంత ప్రమాదకరమైన లింక్స్‌ను సృష్టించారు.
రొనాల్డోతో పోటీపడుతూ, నెంబర్ 2 స్ధానంలో అలనాటి నటి టబు నిలిచారు. ‘అందాధున్’ మరియు ‘ఏ సూటబల్ బాయ్’ వంటి చిత్రాలలో ఆమె విలక్షణ నటనతో ఆమె ఇటీవలి కాలంలో అత్యంత ప్రాచుర్యం పొందిన నటిగా మారారు. ఆమెను అనుసరిస్తూ తాప్సీ పన్ను మూడవ స్థానంలో నిలిచారు. ‘పింక్’ మరియు ‘తప్పడ్ ’వంటి చిత్రాలలో ఆమె నటనకు గానూ ప్రజాదరణ పొందారు. ఆమెను అనుసరిస్తూ సుప్రసిద్ధ బాలీవుడ్ నటి అనూష్క శర్మ నాల్గవ స్థానంలో నిలిస్తే సోనాక్షీ సిన్హా ఐదవ స్ధానంలో నిలిచారు.
ఈ టాప్ టెన్ జాబితాలో మిల్లీనియల్ హార్ట్‌త్రోబ్, భారతీయ గాయకుడు అర్మాన్ మాలిక్ 6వ స్ధానంలో నిలిస్తే, ఇతనికి అతి దగ్గరగా యువ, బబ్లీ నటి సారా అలీఖాన్ 7వ స్థానంలో నిలిచారు. మిగిలిన వారిలో సుప్రసిద్ధ టీవీ నటి దివ్యాంక త్రిపాఠీ 8వ స్ధానంలో, బాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్ 9వ స్ధానంలో, బాలీవుడ్ అభిమాన ప్లేబ్యాక్ సింగర్ అర్జిత్ సింగ్ 10వ స్ధానంలో నిలిచారు.
‘‘వినియోగదారులు గతాని కన్నా మిన్నగా ఉచిత వినోదం కోసం వెబ్‌ను వెదుకుతున్నారు. సైబర్ క్రిమినల్స్ వీరి వెనుక ఉంటూ ఈ ధోరణులను వినియోగించుకుంటున్నారు. సందేహించని వినియోగదారులు తరచుగా ఉచిత మరియు పైరేటెడ్ కంటెంట్ అయినటువంటి ప్రధానమైన క్రీడా కార్యక్రమాలు, సినిమాలు, టీవీ షోలతో పాటుగా చిత్రాలు మరియు లీక్డ్ వీడియోలను తమ అభిమాన సెలబ్రిటీలను గురించి చూస్తున్నారు. చెడ్డ నటీనటులు పాప్ సంస్కృతిపై వినియోగదారుల మోహాన్ని పెంచడంతో పాటుగా సందేహించని అభిమానులను వారి ఉపకరణాలలో మాల్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసే హానికరమైన వెబ్‌సైట్‌ల వైపు నడిపిస్తారు. తద్వారా వ్యక్తిగత సమాచారాన్ని ప్రమాదంలో ఉంచుతారు’’ అని వెంకట్ కృష్ణాపూర్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, మెకాఫీ ఇండియా అన్నారు.
‘‘సౌకర్యం మరియు ఉచితాల కోసం వినియోగదారులు భద్రత పట్ల రాజీపడితే, వారు తమ డిజిటల్ జీవితాలను ప్రమాదంలో నెట్టేయగలరు. అభిమానులు మరింత అప్రమత్తతో ఉండటంతో పాటుగా అనుమానాస్పద లింక్స్‌ను మరీ ముఖ్యంగా ఉచిత కంటెంట్ అందిస్తామన్న వాటిని నిరోధించాలి. అలాంటి వాటిని క్లిక్ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి’’ అని అన్నారు.
2020లో, కోవిడ్ 19 కారణంగా వచ్చిన లాక్‌డౌన్ కారణంగా, భారతీయులు ఆన్‌లైన్‌లో యాక్టివ్‌గా ఉన్నారు. విభిన్నమైన ఉపకరణాల వ్యాప్తంగా ఇంటర్నెట్ వినియోగించడం పెరిగింది. అదే రీతిలో వినోదం కోసమూ ఇంటర్నెట్‌పై ఆధారపడుతున్నారు. ఉచిత సినిమాలు మొదలు టీవీ షోల వరకూ. తాజా సెలబ్రిటీ సమాచారం, గాసిప్స్ వంటి వాటి కోసం వినియోగదారులు డిజిటల్ సెలబ్రిటీ కంటెంట్ కోసం చూస్తూ తమంతట తాము వినోదం పొందుతున్నారు. హ్యాకర్లు సైతం, ఈ ధోరణిని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. తమ స్కామ్ వ్యూహాలను వినియోగదారుల ప్రవర్తలకనుగుణంగా మార్చుకుంటున్నారు.
భారతదేశంలో నిర్వహించిన అధ్యయనంలో టాప్ 10 సెలబ్రిటీలు
1. క్రిస్టినో రొనాల్డో
2. టబు
3. తాప్సీపన్ను
4. అనూష్క శర్మ
5. సోనాక్షీ సిన్హా
6. అర్మాన్‌మాలిక్
7. సారా అలీఖాన్
8. దివ్యాంక త్రిపాఠీ
9. షారూఖ్ ఖాన్
10. అర్జిత్ సింగ్
ఫుట్‌బాల్ గోల్ చేసింది కానీ, బాలీవుడ్ మాత్రం ఇప్పటికీ అత్యున్నతంగానే నిలిచింది. ఓ ఫుల్‌బాలర్ ఈ సంవత్సర జాబితాలో అగ్రస్థానంలో నిలిచినప్పటికీ, బాలీవుడ్ తారలు ఇప్పటికీ ఈ సంవత్సర టాప్ 10 జాబితాలో అధిక స్ధానాలను పొందారు. పని, ఆఫీస్, విద్య వంటివి ఇంటి వద్ద నుంచే జరుగుతుండటంతో, భారతదేశపు యువత ఇప్పుడు అధిక సమయం ఆన్‌లైన్‌లోనే గడుపుతున్నారు. బాలీవుడ్ పట్ల అంతర్గతంగా ఉన్న వారి ఆసక్తి మరియు క్రీడల పట్ల ఉన్న ఇష్టం వారిని సంబంధిత కంటెంట్ వెదికేలా చేస్తుంది.
సుప్రసిద్ధ నటి టబు మొదలు బబ్లీ సారా అలీఖాన్ వరకూ కింగ్ ఖాన్ వంటి వారి ప్రాచుర్యం పొందిన సినిమాల కోసం ఈ సంవత్సరం అభిమానులు స్థిరంగా ఇంటర్నెట్‌లో వెదికారు. ఈ సంవత్సరం అభిమానులకు అమితాసక్తిని బలీయమైన ఫిమేల్ లీడ్ ఉన్న సినిమాలు కలిగించాయి. తాప్సీ, సోనాక్షి, అనూష్కలు ఈ జాబితాలో ఉన్నారు. తన తాదాత్మ్యకమైన సంగీతంతో, ఎన్నో బాలీవుడ్ హిట్ గీతాల వెనుక గాత్రమైన అర్జిత్ సింగ్ ఆకట్టుకుంటే, గాయకుడు, పెర్‌ఫార్మర్, ప్రాచుర్యం పొందిన యూత్ ఐకాన్ అర్మాన్ మాలిక్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. సినిమాలను అనుసరించి టీవీ పరిశ్రమ సైతం భారీ ప్రజాదరణ పొందింది. నటి, ప్రతి ఇంటా మార్మోగే దివ్యాంక త్రిపాఠీ ఈ సంవత్సర జాబితాలో నిలిచారు.
ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉండేందుకు వినియోగదారులకు సహాయపడే సూచనలు:
ఈ దిగువ సూచనలతో వినియోగదారులు సురక్షితంగా ప్రవర్తించడం ద్వారా తమ వంతు పాత్రను భద్రత పరంగావినియోగదారులు పోషించగలరు:
మీరు ఏం క్లిక్ చేస్తున్నారనే అంశమై ఆప్రమప్తత ఉండాలి: వినియోగదారులు తాజా విడుదలలు కోసం, అలాగే తమ అభిమాన సెలబ్రిటీలకు సంబంధించిన తాజా సమాచారం కోసం వెదుకుతున్నారు. అయితే వారు అప్రమత్తంగా ఉండటంతో పాటుగా విశ్వసించతగిన వనరుల నుంచి వచ్చిన లింక్స్ మాత్రమే క్లిక్ చేయాలి. సురక్షితమైన విధానమంటే, అధికారిక విడుదల కోసం, విశ్వసనీయమైన టీవీ మరియు మూవీ స్ట్రీమింగ్ వేదికలలో మాత్రమే చూడాలి. అలా కాకుండా థర్డ్ పార్టీ వెబ్‌సైట్లలో చూడడం వల్ల మాల్‌వేర్ వచ్చే ప్రమాదం ఉంది.
చట్టవిరుద్ధమైన స్ట్రీమింగ్‌కు దూరంగా ఉండటంతో పాటుగా అనుమానాస్పద ఎంపీ3లను డౌన్‌లోడ్ చేయవద్దు: అంధాధున్‌ను మరలా చూడాలనుకున్నా లేదంటే అర్జిత్ యొక్క మహిమాన్విత గొంతును వినాలనుకున్నా కేవలం చట్టబద్ధమైన సంగీత మరియు మూవీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ చూడాలి. ఆఖరకు అవి ఖర్చుతో కూడుకున్నవి అయినా సరే, చాలా వరకూ చట్టవ్యతిరేక డౌన్‌లోడ్స్‌లో మాల్‌వేర్ లేదా యాడ్‌వేర్ వంటివి ఎంపీ3లతో కలిసిఉంటాయి.
సైబర్ సెక్యూరిటీ పరిష్కారాలతో ఆన్‌లైన్ భద్రతను కాపాడుకోండి: సైబర్ క్రిమినల్స్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. సమగ్రమైన భద్రతా పరిష్కారాలైనటువంటి మెకాఫీ టోటల్ ప్రొటెక్షన్ వినియోగించండి. ఇది మిమ్మల్ని మాల్‌వేర్, ఫిషింగ్ ఎటాక్స్ మరియు ఇతర భయాల నుంచి కాపాడుతుంది.
పేరెంటల్ కంట్రోల్ సాఫ్ట్‌వేర్ వినియోగించండి: చిన్నారులు సైతం సెలబ్రిటీలకు అభిమానులే. అందువల్ల మీ చిన్నారుల కోసం పరిమితులను ఏర్పరుచుకోండి. పేరెంటల్ కంట్రోల్ సాఫ్ట్‌వేర్‌తో హానికారక, అనుచితమైన వెబ్‌సైట్‌ల బారిన పడటం తగ్గించవచ్చు.