అతిపెద్ద ఖగోళ అద్భుతం... శనిగ్రహానికి అతి సమీపంగా గురుగ్రహం

శనివారం, 24 జులై 2021 (14:35 IST)
ఖగోళంలో అద్భుతం జరుగనుంది. శనివారం, ఆదివారాల్లో చంద్రుడు ఈ రోజు శనిగ్రహానికి అత్యంత దగ్గరగా వెళ్తాడు. 25న గురుగ్రహానికి దగ్గరగా సమీపిస్తాడు. అంతేకాదు.. భూమి, సూర్యుడు, చంద్రుడు ఒక సరైన రేఖలోకి వస్తాయని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
 
కాగా, చంద్రుడు ఒక 5 డిగ్రీలు కాస్త పక్కకి ఉండడం వల్ల సూర్యుడి కాంతి పూర్తిగా చంద్రుడి మీదే పడుతుంది. ఈ సమయంలో చంద్రుడు చాలా కాంతివంతంగా కనిపిస్తాడు. ఇలాంటి చంద్రుడిని "బక్ మూన్" లేదా "థండర్ మూన్" అని పిలుస్తాయని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
 
ఇకపోతే, 24న అంటే ఈరోజు చంద్రుడు నాలుగు డిగ్రీల పాటు పక్కకు జరిగే చంద్రుడు.. 25న మరో నాలుగు డిగ్రీల పాటు జరిగి గురుగ్రహానికి దగ్గరవుతాడు. ఈ రెండు గ్రహాలు కూడా సోమవారం తెల్లవారకముందు సమయంలో పక్కపక్కనే మనకు కనిపిస్తాయి. వీటిని నేరుగా లేదా బైనాక్యులర్స్ సాయంతో చూడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు