కానీ బిజెపి మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. వేగంగానే ప్రజా సమస్యలపై స్పందిస్తూ పోరాటాలకు దిగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా హిందూత్వంపై ఆ పార్టీ నేతలు చేస్తున్న పోరాటం ప్రజల్లో మంచి ఫలితాన్నే వచ్చే విధంగా చేస్తోంది.
ముఖ్యంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్వయంగా కేంద్ర నాయకత్వం దృష్టికి జనసేన వ్యవహారాన్ని తీసుకెళ్ళాలని చూస్తున్నారట. ఎక్కడా ప్రభుత్వంపై పోరాటం చేయకుండా ప్రెస్ నోట్లకే జనసేన పరిమితమైపోతోందని సోము వీర్రాజు కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్ళబోతున్నారట. అస్సలు పూర్తిగా వారిని దూరం పెడితే మంచిదన్న అభిప్రాయాన్ని కూడా సోము వీర్రాజు చెప్పబోతున్నారట. మరి చూడాలి బిజెపి.. జనసేనల మధ్య స్నేహబంధం కొనసాగుతుందా.. లేకుంటే మధ్యలోనే ఆగిపోతుందా..?