జయలలిత కెరీర్ ఎంజీఆర్ వల్లే నాశనం.. మరణించేటప్పుడూ ప్రశాంతత లేకుండా చేసిన శశికళ.. నిజమేనా?

శనివారం, 10 డిశెంబరు 2016 (12:49 IST)
ఎంజీఆర్‌ వల్లే అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రశాంతంగా జీవించలేకపోయింది... బుద్ధికుశలతలు ఉన్నప్పటికీ అమ్మ జీవితంలో ప్రశాంతత కరువైంది. అలాగే చివరి రోజుల్లో మన్నార్‌గుడి గుంపు కూడా ఆమెను ప్రశాంతంగా చావనివ్వలేదని అన్నాడీఎంకే కార్యకర్తలు అనుకుంటున్నారు. అమ్మ మరణంపై పలు అనుమానాలున్నాయి. అమ్మ మరణంపై సోషల్ మీడియాలో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 
 
దాదాపు 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఓ మహిళ నిలదొక్కుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. ఇంకా డీఎంకే అధినేత కరుణానిధి చాణక్యుడు. ఆయన ముందు రాజకీయాలు చేయడం అనేది అంత సులభమూ కాదు. కానీ దాన్నీ కూడా సుసాధ్యం చేశారు.. జయలలిత. అయితే ఆమె జీవితంలో ఒంటరితనమే.. ఆమె మరణంలోనూ ప్రశాంతత లేకుండా చేసింది. 
 
కుటుంబం లేకపోవడంతో రోడ్డున పోయిన వారందరూ ఆమెకు మేలు చేస్తానని లోనికొచ్చి.. ఆమె ప్రాణాలు తీసుకున్నారని అన్నాడీఎంకే నేతలు వాపోతున్నారు. జయలలిత మరణానికి సంబంధించిన అనుమానాలు నివృత్తి కావాలంటే.. రాష్ట్ర సర్కారు పారదర్శకంగా ఉండాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. 
 
ప్రశ్నలేంటి?
* సెప్టెంబర్ 22 అర్థరాత్రి ఉన్నట్టుండి అపోలోలో జయలలిత ఎందుకు చేరారు? 
* రామచంద్ర ఆస్పత్రికే వెళ్ళే జయలలితను అపోలోకు ఎందుకు తీసుకెళ్లారు?
* అపోలోకు ఎమెర్జీన్సీకి తరలించారని వార్తలు వస్తున్నాయి. ఆ రోజు రాత్రి పోయెస్ గార్డెన్‌లో జరిగిన భేటీలో అమ్మ స్పృహ తప్పి కింద పడిపోయారని.. అందుకు ఢిల్లీ నుంచి వచ్చిన ఓ ఫోన్ కాలే కారణమని తెలిసింది. ఆ ఫోన్ కాల్ ఎవరు చేశారు?
* ఆపై అపోలోలో 75 రోజులు... ఆమె ఫోటోలు విడుదల కాలేదు.. ఆమె గురించి వివరాలు తెలియరాలేదు ఎందుకు?
* పరామర్శించేందుకు వెళ్లిన వారికి కూడా అమ్మ ముఖం చూపలేదు. ఎందుకు?  
* డీహైడ్రేషన్ అని ఆస్పత్రిలో చేరిన పాపానికి అపోలో ఆసుపత్రిలో గుండెపోటు తెప్పించిన మాట నిజమేనా?
* అపోలో సెకండ్ ఫ్లోర్ మొత్తం అమ్మ కోసమే అద్దెకు తీసుకున్నారు. దోమ కూడా ఆ ఫ్లోర్‌లోకి వెళ్లేందుకు అనుమతివ్వకుండా భద్రత ఏర్పాటు చేశారు. ఎవరినీ లోనికి ఎందుకు అనుమతించలేదు?
* ఆపై హెల్త్ బులిటెన్లు, ఆడియోలు విడుదల చేసినా అమ్మను ఎందుకు చూడనివ్వలేదు? 
* అమ్మ మాట్లాడుతున్నారు.. ఆహారం తీసుకుంటున్నారంటూ చెప్పినవన్నీ కట్టుకథలేనా?
* అమ్మ ముఖం కూడా చూపించలేదు.. ఫోటోలు ఎందుకు విడుదల చేయలేదు? 
* అమ్మ గురించి ఏది రాయాలన్నా భయపడిన మీడియా, కేసులకు భయపడి చేతులు ముడుచుకుంది. ఇలా ఎందుకు జరిగింది? 
 
అమ్మ మృతిపై అనుమానాలు 
1. అమ్మ ఎలాంటి పరిస్థితుల్లో ఆస్పత్రిలో చేరారు?
2. డీహైడ్రేషన్, జ్వరం అంటూ అత్యుత్తమ ప్రైవేట్ ఆస్పత్రి అయిన అపోలో చేరారు. కానీ మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ ఎలా జరిగింది. అమ్మకు మెరుగైన చికిత్సను అపోలో అందించలేదా?
3. అమ్మ కోసం అపోలో ఆసుపత్రి ఎలాంటి చికిత్సలు అందించింది?
4. జయలలిత స్పృహ తెలిసిందా? ఆమె కోలుకున్నారా?
5. జోకులేశారు.. బంతాట ఆడారంటూ చెప్పిన నర్సులు.. ఎందుకు ఫోటోలు విడుదల చేయడం లేదు?
6. అమ్మ సంతకాలు అప్పట్లో ఎందుకు వివాదాస్పదమైనాయి? 
7. ఓసారి సంతకాలు, మరోసారి చేతి ముద్రలతో అమ్మ ప్రకటనలు వచ్చాయంటే.. అమ్మ ఆరోగ్యం నిలకడగా లేదా? సంతకాలు ఫోర్జరీనా?
8. అపోలో ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి అమ్మ ఎప్పుడైనా ఇంటికెళ్లవచ్చునని ప్రకటన చేయడం నిజమయితే అమ్మ ఎందుకు మాట్లాడలేదు..?
9. అబద్ధాలతో అపోలో ప్రతాప్ రెడ్డి చేసిన ప్రకటనలో నిజం లేదా?
10. ప్రతాప్ రెడ్డిని శశికళ బెదిరించారా?
11. కేంద్ర ప్రభుత్వ పథకాలకు మూర్ఖంగా జయలలిత అడ్డుపడ్డారు. అయితే ఆ పథకాలకు ఆపై సునాయాసంగా గ్రీన్ సిగ్నల్ రావడానికి కారణం ఏమిటి? అమ్మ లేరనే ధైర్యమా? లేకుంటే అమ్మ అప్పుడే చనిపోయారా?
12. గుండెపోటు కూడా నాటకమా?
13. అమ్మ మరణం ఎప్పుడో సంభవించిందా?
14. అమ్మ మృతి చెందినట్లు వచ్చిన వార్తలన్నీ వదంతులని ఆ రోజు రాత్రి అపోలో చేసిన ప్రకటనలో నిజం లేదా?
15. అపోలో అమ్మ మృతికి తోడు పోయిందా?
16. ఎందుకు గవర్నర్‌కు కూడా అమ్మ ముఖాన్ని చూపించలేదు? 
17. ఇన్ఫెక్షన్ పేరిట ఎవర్నీ చూడనీయని అపోలో.. శశికళను మాత్రం పక్కనే వుండేలా ఎందుకు చేసింది?
18. శశికళ వల్ల అమ్మకు ఇన్ఫెక్షన్ అంటుకోదా?
20. 75 రోజులు అమ్మకు అందించిన చికిత్సపై అపోలో ప్రకటన విడుదల చేస్తుందా? ఫోటోలు, వీడియోలతో సహా....?
 
రాజకీయ పరమైన అనుమానాలు 
1. పన్నీర్ సెల్వంకు సీఎం పగ్గాలు అప్పగించింది ఎవరు?
2. ఎవరితోనూ సంప్రదించకుండా.. ముఖ్యమంత్రిని ఎన్నుకోవడంలో ఉన్న రహస్యం ఏమిటి?
3. జయలలిత మృతి వార్త రాకముందే భేటీలు ఎందుకు?
4. చరిత్రలో లేని విధంగా సీఎం మృతదేహం ఆస్పత్రిలో ఉండగానే.. మంత్రులందరూ అకాలంలో పదవులు చేపట్టేందుకు కారణం ఏమిటి?
5. జయలలిత అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్ళిన సందర్భంగా ఎక్కిళ్లు పెట్టి ఏడ్చిన మంత్రులు.. జయలలిత ఇక తిరిగిరారనే వార్త విని ఎందుకు చలనం లేకుండా ఉన్నారు. 
6. అమ్మ మరణంలో మంత్రులు కంట నీరు రాకపోవడానికి కారణం?
7. కోట్లాది మంది ప్రజలు అమ్మ ముఖం చూడాలని వస్తుంటే.. సాయంత్రానికే ఖననం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? 
8. మన్నారు గుడి గుంపు అమ్మ భౌతిక కాయాన్ని చుట్టుముట్టేందుకు కారణం ఏమిటి?
9. పోయెస్ గార్డెన్ నుంచి తరిమికొట్టబడని ఆ గుంపు అమ్మ దగ్గరకు మళ్లీ ఎందుకొచ్చింది?
10. ఇంకా అమ్మ జీవితాంతం దూరంగా పెట్టాలనుకున్న నటరాజన్, దివాకరన్ వంటి వారు అమ్మ భౌతిక కాయం దగ్గరికి ఎందుకొచ్చినట్లు?
11. జయలలిత అన్న కుమార్తె దీపను అంత్యక్రియల వద్ద ఎందుకు అనుమతించలేదు?
12. ప్రధానితో పన్నీర్ సెల్వం కంటే ముందు దివాకరన్ మాట్లాడారా?
13. శశికళనే ఓదార్చేందుకు కారణం ఏమిటి? 
ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం లభించాలంటే.. అపోలో ఆసుపత్రిలో ఏం జరిగిందో అన్నీ తెలియాలి. ఆస్పత్రిలో అమ్మ ఏ పరిస్థితిలో చేరిందనేందుకు ఆధారాలు చూపాలి. ఇలా జరిగేందుకు శశికళనే కారణమా? అసలేం జరిగిందనేది తెలియాలంటే.. రాష్ట్ర సర్కారు నిజాలను వెలుగులోకి తేవాలి. అప్పటివరకూ తమిళనాడులో ఈ చర్చ ఆగదు.. ఇది ఎంత దూరమైనా వెళ్లే అవకాశం ఉంది.

వెబ్దునియా పై చదవండి