ప్రేమకథలను ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారు. కానీ, హృదయ బంధాల దగ్గరకు వచ్చేసరికి, ప్రతి తరమూ తమవైన నియమావళిని అనుసరిస్తుంటుంది. ప్రేమ బంధం ఏర్పరుచుకోవడానికి అడుగు వేయడం దగ్గర నుంచి హోమగుండం వద్దకు నడువడం వరకూ... చేయకూడనివి మరియు చేయాల్సినవి, చెప్పనివి చాలా ఉన్నాయి. సామాజిక కోణంలో మాత్రమే ఇవి ఆసక్తికలిగించేటటువంటివి కావు కానీ, ప్రేమలో ఉన్న జంటలకు సైతం ఆసక్తిగొల్పుతుంటాయి.
ప్రతి ఒక్కరి జీవితం, పనిపై మహమ్మారి చూపిన ప్రభావం మాత్రమే కాదు, దాని అనంతర పరిణామాలూ వైవిధ్యమైన ప్రేమ ప్రపంచాన్నీ వదలలేదు. ఆసక్తికరంగా, ఇంట్లోనే బందీలైనప్పటికీ, గత సంవత్సరంన్నర కాలం మనందరికీ ప్రేమ మరియు సాన్నిహిత్యం ను పునః సమీక్షించుకునే అవకాశాన్ని మాత్రం అందించింది. నూతన అంశాలను నేర్వడం, డేట్స్మరియు మీట్-క్యూట్స్ సహా పాతవే అయినా తెలియని అంశాలను తెలుసుకోవడం జరిగింది.
తమ మొట్టమొదటి లవ్ సర్వే 2021లో భారతదేశపు సుప్రసిద్ధ సువాసనల బ్రాండ్ ఎంగేజ్, మార్కెట్ పరిశోధనలో అంతర్జాతీయంగా అగ్రగామిగా వెలుగొందుతున్న ఐప్సోస్ భాగస్వామ్యంతో ఓ అధ్యయనాన్ని ఈ నూతన సాధారణత వేళ మారుతున్న ప్రేమ భాషను అన్వేషించడానికి నిర్వహించింది. ఈ అధ్యయనంలో నూతన సాధారణత వేళ ప్రేమాయణం పట్ల యువ భారతం యొక్క వైఖరి, ప్రవర్తనను అధ్యయనం చేసింది. ప్రేమ భాషను మరియు అభివృద్ధి చెందుతున్న ప్రేమాయణాన్ని ఎల్లప్పుడూ ఎంగేజ్ వేడుక చేస్తూనే ఉంటుంది.
ఆసక్తికరమైన ప్రశ్నలతో నిర్వహించిన ఈ భారీ అధ్యయనంలో ప్రేమ, బంధాలు, సంభాషణ ఆరంభాలు, ఆకర్షణలు , వర్ట్యువల్ తో వాస్తవ ప్రేమ సరిపోల్చడం వంటి అంశాల పట్ల ఆసక్తికరమైన అంశాలను నేర్వడం మాత్రమే కాదు, ఈ నమ్మకాలు ఏ విధంగా మారాయన్నది కూడా తెలుసుకున్నారు.
అధ్యయనంలో కనుగొన్న కీలకాంశాలు:
యువత మరియు ప్రేమ మరియు శృంగారం పట్ల వారి ఆలోచనలు- 63% మంది స్పందన దారులు దీర్ఘకాలపు బంధాలను విశ్వసిస్తున్నారు.
వర్ట్యువల్ అనుసంధానిత నూతన నియమాలు:
నాన్ మెట్రో నగరాలలోని 36% మంది స్పందనదారులు, భౌతికంగా దూరంగా ఉండాల్సి రావడమనేది ప్రేమాయణం నిర్వహించడానికి అవరోధం కానే కాదని అభిప్రాయపడ్డారు. ఈ రోజుల్లో ప్రేమాయణం నిర్వహించడానికి, ఆ మెరుపులను సజీవంగా ఉంచడానికి ఎన్నో మార్గాలు అందుబాటులో ఉన్నాయని అంటున్నారు. నాన్ మెట్రో నగరాల స్పందన దారుల అభిప్రాయాలకు భిన్నంగా కేవలం 24% మంది మెట్రో స్పందన దారులు మాత్రమే దీనిని అంగీకరిస్తున్నారు.
బంధాలపై లాక్‌డౌన్ ప్రభావం:
లాక్‌డౌన్ నూతన బంధాలను ఒత్తిడిలోకి నెట్టివేసింది. దాదాపుగా 80% సింగిల్/క్యాజువల్ డేట్స్, తమ ప్రేమాయణం ఆరంభించడం/ఓ బంధాన్ని అభివృద్ధి చేయడం కష్టంగానే భావించారు. స్పందనదారులలో 75% మంది లాక్‌డౌన్‌ల కారణంగా బంధాలను ఆరంభించడం మాత్రమే కాదు, ఆరంభమైన బంధాలను అభివృద్ధి చేయడం కూడా కష్టంగానే భావిస్తున్నారు. మరోవైపు, తమ సంబంధాల అర్థవంతమైన అంశాలను అర్థం చేసుకోవడానికి కూడా ఇది సహాయపడింది.
వర్ట్యువల్ వర్సెస్ రియల్ లైఫ్:
వాస్తవ ప్రేమాయణంతో పోల్చినప్పుడు వర్ట్యువల్ ప్రేమాయణం పూర్తి భిన్నమైనదని 98% మంది స్పందనదారులు భావించారు. వర్ట్యువల్ ప్రేమాయణంలో ప్రామాణికత ఉండదని భావిస్తుండటమే కాదు, స్వాభావికంగా అది సాధారణంగా ఉండటమే కాదు ప్రమాదకరమైనదిగా కూడా భావిస్తున్నారు.
వర్ట్యువల్ ప్రేమాయణంపై విజయం సాధిస్తున్న వాస్తవ జీవితపు ప్రేమాయణం :
వాస్తవ జీవితంలో ఎవరైతే కాస్త సిగ్గరిలుగా ఉండటంతో పాటుగా అంతర్ముఖులుగా ఉంటారో అలాంటి వారికి వర్ట్యువల్ ప్రపంచంలో ప్రేమాయణం సహాయపడవచ్చని 50% మంది భావిస్తున్నారు. అదే సమయంలో మెట్రో నగరాలలో 50% మంది వర్ట్యువల్ ప్రపంచంలో ప్రేమాయణం సరసమైనది/క్యాజువల్‌గా ఉంటుందంటూనే సాధారణంగా తీవ్రతతో కూడి ఉండదని చెబుతున్నారు. స్పందనదారులలో 46% మంది వర్ట్యువల్ ప్రపంచంలో ప్రేమాయణం కొన్నిసార్లు అత్యంత ప్రమాదకరంగా మారవచ్చని అభిప్రాయపడ్డారు.
కోవిడ్-19కు ముందు మరియు ఆ తరువాత ప్రేమాయణం :
మహమ్మారి కాలంలో, సానుకూల మాటలతో ప్రేమాయణం సాగించడం అనే అంశంలో క్షీణత కనిపించింది. కోవిడ్ ప్రపంచంలో, కలిసి ఉండటం అనే పద ప్రయోగం 23% తగ్గగా, అనుసరించి కెమిస్ట్రీ అనే పద ప్రయోగం ప్రస్తుత వాతావరణంలో 14% తగ్గింది. అయితే, నెగిటివ్ పదాలుగా చెప్పబడుతున్న కష్టం, ఆందోళన, అసహనం వంటి పద ప్రయోగాలు వరుసగా 25%, 15%, 20% పెరిగాయి . నూతన సాధారణతలో ప్రేమాయణం అనే ఆలోచన మారుతున్న తీరును ఇది సూచిస్తుంది.
లాక్‌డౌన్ ప్రభావం :
మహమ్మారి కారణంగా ఐసోలేషన్‌లో ఉండటమనేది 85% మంది స్పందనదారులకు తమ బంధాలలోని అర్థవంతమైన అంశాలను అర్థం చేసుకోవడానికి తోడ్పడింది. కానీ, ఈ లాక్‌డౌన్స్ కారణంగానే 84% మంది స్పందనదారులు తమ భాగస్వాములతో అనుసంధానించబడటానికి నూతన, సృజనాత్మక మార్గాలను కనుగొనడం జరిగిందని వెల్లడించారు.
ఈ నూతన సాధారణతలో ప్రేమాయణం పరంగా గణనీయమైన మార్పులు కనిపించాయి కానీ, ఓ భావోద్వేగంగా ప్రేమ మాత్రం బంధాన్ని పెంపొందించడానికి, బంధాన్ని మరింత ధృడంగా మార్చడానికి మార్గాలను అన్వేషిస్తూనే ఉంది. డిజిటల్ యుగంలో వర్ట్యువల్ ప్రేమాయణంకు సంబంధించి సానుకూలతలు, వ్యతిరేకతలు ఉన్నాయి. అయితే ఈ వెలుగును సజీవంగా ఉంచడానికి నిరంతరం మార్గాలను అన్వేషించాల్సి ఉంది.
అది వినోదాత్మక వర్ట్యువల్ డేట్స్ నిర్వహించడం, మూవీ మారథాన్ ఆస్వాదించడం లేదా అకస్మాత్తుగా వర్ట్యువల్ ఆశ్చర్యం కలిగించడం, ఏదైనా సరే వీలైనంత వాస్తవంగా బంధాన్ని నిలుపడం తప్పనిసరి. అయితే, వర్షంలో ఒకే గొడుగు కింద ఒకరి కళ్లలోకి ఒకరు చూస్తూ చేతిలో చెయ్యేసి నడువడం, మధురస్మృతులను పంచుకోవడం వంటి అంశాలకు ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది.
ఎంగేజ్ లవ్ సర్వే 2021ను 18-35 సంవత్సరాల వయసు కలిగి, మెట్రో, మెట్రోయేతర నగరాలలో ఉన్న 1199 మంది యువతీయువకుల చేత నిర్వహించారు. ఈ అధ్యయనాన్ని డిసెంబర్ 2020లో ఇప్సోసోస్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించింది.