ప్రస్తుతం పురుష కుటుంబ నియంత్రణ మాత్రల అభివృద్ధిలో అనేక అవరోధాలు ఉన్నాయి. ఒకటి.. వీర్య కణ జీవశాస్త్రంపై శాస్త్రవేత్తలకు పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం. రెండు.. వీర్య కణంలో కీలక విధులకు తోడ్పడే ముఖ్య ప్రొటీన్‌ను గుర్తించే అధ్యయనాలు జరగకపోవడం. మూడోది.. ప్రస్తుతమున్న అనేక రసాయనాలు, ఔషధాల ప్రభావాన్ని స్క్రీన్ చేసే సమర్థ వ్యవస్థ లేకపోవడం.
ఈ ఇబ్బందులను అధిగించడానికి దుండీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చిన్నపాటి, సమాంతర పరీక్ష వ్యవస్థను అభివృద్ధి చేశారు. అందులో వేగవంతమైన మైక్రోస్కోపు, ఇమేజ్ ప్రాసెసింగ్ సాధనాలు ఉంటాయి. అవి మానవ వీర్య కణాల వేగవంతమైన కదలికలను అత్యంత కచ్చితత్వంతో గుర్తిస్తాయి. తద్వారా ఔషధాల సమర్థతను కొలవడానికి వీలవుతుందని ఆ శాస్త్రవేత్తలు వెల్లడించారు.