అదేసమయంలో లోక్‌సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా కుమారుడు కాన్‌రాడ్ సంగ్మా సారథ్యంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్.పి.పి) 19 సీట్లను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ పార్టీకి 2 సీట్లలో విజయం సాధించిన బీజేపీతో పాటు యూడీపీకి (6), పీడీఎఫ్ (4), హెచ్‌ఎస్‌డీపీపీ (2)తోపాటు మరో స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతు ఇస్తున్నారు. దీంతో మొత్తం సంఖ్య 34కు చేరుకుంది.
అయితే, ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని యూడీపీ నేతలు ప్రకటించారు. ఇపుడు సంగ్మా సారథ్యంలో ఏర్పాటైన ప్రభుత్వంలో బీజేపీని చేర్చుకోవడాన్ని హెచ్‌ఎస్‌డీపీపీతో పాటు యూడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యతిరేక మరింత పెరిగి... ఈ రెండు పార్టీలు కాన్‌రాడ్ సర్కారుకు ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకుంటే మేఘాలయా సర్కారు కూలిపోవడం ఖాయంగా తెలుస్తోంది.