హుజూరాబాద్ బైపోల్: కారు పరుగెడుతుందా? కమలం వికసిస్తుందా?

శనివారం, 30 అక్టోబరు 2021 (19:46 IST)
స్వల్ప ఉద్రిక్తల నడుమ హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ సాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద 7 గంటల వరకూ ఎవరైతే వున్నారో వారందరీకి ఓటు వేసే అవకాశం కల్పించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శశాంక్ గోయల్ తెలిపారు. కాగా హుజూరాబాద్ ప్రజలు ఒక్కరు కూడా బీరుపోకుండా ఓట్లు వేసేందుకు పోలింగ్ బూత్ ల వద్దకు వచ్చేశారు. సాయంత్రం 5 గంటలకే 76 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషనర్ గోయల్ తెలిపారు.

 
గత ఎన్నికల్లో ఇక్కడ 86.28% ఓటింగ్ నమోదైంది. ఈసారి అది 90 శాతానికి పైగా వుంటుందని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. ఓటింగ్ శాతాన్ని చూసి అటు తెరాస, ఇటు భాజపా గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ప్రజలు ఏదో ఒక పార్టీకి మూకుమ్మడిగా ఓట్లు వేసేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

 
ప్రగతి భవన్ అహంకారాన్ని బొందపెడదాం.. హుజూరాబాద్ ఆత్మగౌరవాన్ని గెలిపించుకుందాం అని తన పిలుపు మేరకు ప్రజలు తమ పార్టీకే ఓట్లు వేస్తున్నారని ఈటెల రాజేందర్ అంటున్నారు. ఐతే ఈటెలకు గట్టిగా బుద్ధి చెప్పేందుకే ప్రజలు పెద్దఎత్తున ఓటింగులో పాల్గొంటున్నారని తెరాస చెపుతోంది. మరి గెలుపు ఎవరిదన్నది సస్పెన్సుగా మారింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు