కావలసిన పదార్థాలు: పాలు: పది కప్పులు పంచదార: అరకప్పు ఏలకుల పొడి: అర టీ స్పూన్ జీడిపప్పు ముక్కలు: అరకప్పు బియ్యం రవ్వ: రెండు టీ స్పూన్లు
తయారీ విధానం: రెండు కప్పుల నీటితో, గోధుమ రంగులో వేయించిన బియ్యం రవ్వను కలిపి కాసేపు ఉడికించండి. బియ్యం రవ్వ ఉడికాక అందులో పాలను చేర్చి బాగా మరిగించండి. ఇందులో పంచదార కలిపి కాసేపు మరిగాక వేయించిన జీడిపప్పు, ఎండుద్రాక్ష ముక్కలి చేర్చి దించండి. దించేముందు అందులో ఏలకుల పొడిని కలిపాలి.