దీపావళి 2011 కాజు పిస్తా

శుక్రవారం, 21 అక్టోబరు 2011 (18:19 IST)
కావలసిన పదార్ధాలు:
మసాలాకోసం: లిక్విడ్ గ్లూకోజ్ - 50గ్రా, పిస్తా - 50గ్రా, జీడిపప్పు - 300గ్రా, లెమన్ ఎల్లో కలర్ - 1గ్రా, పంచదార -300గ్రా.
పేస్ట్ కోసం: జీడిప్పు -400గ్రా, పిస్తా - 100గ్రా, పంచదార - 300గ్రా, గ్రీన్ కలర్ - 1గ్రా.

తయారుచేయు విధానము:
పేస్టు: జీడిపప్పు, పిస్తా కలిపి అరగంట సేపు నానపెట్టి మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి. దానిలో గ్రీన్ కలర్ కలిపి, పక్కన పెట్టుకోవాలి.

మసాలా: లిక్విడ్ గ్లూకోజ్‌ను గోరువెచ్చగా చేసి, దానిలో పంచదార, జీడిపప్పు, పిస్తావేసి కలపాలి. దానిలో లెమన్ ఎల్లో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. పేస్ట్‌ని ఒక ప్లేట్‌లో పలుచగా సర్దుకుని, దానిపై జీడిపప్పు, పిస్తా కలిపిన ఉండలను పెట్టి, వాటిపై మరలా ఒక వరస పేస్ట్ వేసి, పల్చగా ఒత్తుకోవాలి. అలా ఒత్తిన ఒక్కో ఉండను నాలుగైదు ముక్కలుగా త్రికోణాకారంలో కట్ చేసుకోవాలి. రుచికరమైన కాజు పిస్తా రెడీ!

వెబ్దునియా పై చదవండి