2014 తెలంగాణ ఎన్నికలు... రేపే నోటిఫికేషన్... 9 వరకూ నామినేషన్లు

మంగళవారం, 1 ఏప్రియల్ 2014 (20:16 IST)
FILE
2014 ఎన్నికలకు సంబంధించి తెలంగాణ ప్రాంతం సార్వత్రిక ఎన్నికలకు రేపు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ తెలిపారు. నామినేషన్లును దాఖలు చేసేందుకు అభ్యర్థితో పాటు కార్యాలయంలోకి ఐదుగురిని మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. అదేవిధంగా నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఒక్కో అభ్యర్థికి సంబంధించి మూడు వాహనాలను మాత్రమే అనుమతిస్తామని వెల్లడించారు.

ఏప్రిల్ 9వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరణ ఉంటుందనీ, 7వ తేదీ నుంచి ఓటర్లకు స్లిప్పుల పంపిణీ జరుగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని మొత్తం 42 పార్లమెంటు స్థానాలకు 42 మంది ఎన్నికల పరిశీలకులను, 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు 84 మంది పరిశీలకులను నియమించామని అన్నారు.

వెబ్దునియా పై చదవండి