కొడుకు కేటీఆర్ కు తండ్రి కేసీఆర్ రూ.43.40 లక్షల అప్పు ఇచ్చాడట

బుధవారం, 9 ఏప్రియల్ 2014 (20:04 IST)
WD
తండ్రి కేసీఆర్ కొడుకు కేటీఆర్ కు అప్పు ఇచ్చారా...? ఇదేమిటి అని ఆశ్చర్యంగా ఉందా...? బుధవారం తెలంగాణలో నామినేషన్లు వేసేటప్పుడు ఈ వ్యవహారం బయటపడింది మరి. తెరాస అధినేత కేసీఆర్, తన కుమారుడు, తెరాస ఎమ్మెల్యే కేటీఆర్ కు రూ. 43.40 లక్షలు అప్పుగా ఇచ్చినట్లుగా నామినేషన్ లో పేర్కొన్నారు.

శాసనసభకు కేటీఆర్ బుధవారం నామినేషన్ వేసిన సందర్భంలో అఫిడవిట్లో తనకు మొత్తం 1.82 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయని తెలిపారు. ఈ అప్పుల్లో తండ్రి కేసీఆర్ నుంచి రూ. 43.40 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు పేర్కొన్నారు. నామినేషన్ వేసేందుకు బుధవారం చివరి రోజు కావడంతో తెలంగాణ ప్రాంత నాయకులంతా ఇవాళ ఆ వ్యవహారాన్ని పూర్తి చేశారు.

వెబ్దునియా పై చదవండి