Director Gautham Tinnanuri
నానితో జెర్సీ సినిమా తీసిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ప్రస్తుతం ఏ సినిమా చేయాలనే డైలమాలో వున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ తో తీసిన కింగ్‌డమ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని చవిచూస్తుందని అనుకున్నారు. కానీ ఓపెనింగ్స్ బాగానే వచ్చినా రొటీన్ ఫార్మెట్ వుండడంతోపాటు అందులో కొన్ని సన్నివేశాలు హాలీవుడ్ సినిమాల కాపీగా పేరు వచ్చింది. విజయ్ దేవరకొండ పడ్డ కష్టం సినిమాకు లాభాలు తెచ్చిపెట్టలేకపోయింది. చిత్ర నిర్మాత సంస్థ నాగవంశీ సక్సెస్ అని పేర్కొన్నా ఆ తర్వాత కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి.