సమంత తన సోషల్ మీడియాలో అభిమానులను అలరిస్తుంటుంది. వ్యక్తిగతంగా కంటే ప్రస్తుతం ఆమె సినిమాలపై కాన్ సన్ ట్రేషన్ చేస్తుంది. ఇటీవలే తన స్వంత నిర్మాణ సంస్థ త్రలాలా మూవింగ్ పిక్చర్స్ కింద సినిమాలు కూడా నిర్మిస్తోంది. ఇటీవల ఆమె స్వయంగా నిర్మించిన శుభం అనే చిత్రంలో అతిధి పాత్రలో కనిపించింది. ప్రస్తుతం, ఆమె నిర్మిస్తున్న మా ఇంటి బంగారం అనే చిత్రంలో కూడా పనిచేస్తోంది. అయితే, ఆమె బాలీవుడ్ వెబ్ సిరీస్ రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్‌లో ఆమె భాగం కావడంలేదని బాలీవుడ్ కథనాలు చెబుతున్నాయి.