గల్లా జయదేవ్ తరపున నటుడు సునీల్ ప్రచారం... అద్గదీ సంగతి...
శుక్రవారం, 28 మార్చి 2014 (10:48 IST)
WD
కాంగ్రెస్ పార్టీ నుంచి ఈమధ్యనే తెలుగుదేశం పార్టీలో చేరి గుంటూరు పార్లమెంటు అభ్యర్థిగా రంగంలోకి దిగిన మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ నియోజకవర్గంలో ప్రచారం మొదలెట్టారు. ఐతే ఆయనకు టాలీవుడ్ నుంచి పుష్కలంగా సినీ గ్లామర్ అందుబాటులో ఉంది. ఐతే మహేష్ బాబు కాకుండా హాస్య నటుడు, హీరో సునీల్ ను ప్రచారానికి ఉపయోగించుకోనున్నట్లు సమాచారం.
ఈ విషయాన్ని స్వయంగా సునీల్ ప్రకటించాడు. తాను గల్లా జయదేవ్ తరపున ఎన్నికల ప్రచారం చేస్తానని అన్నాడు. వ్యాపారవేత్తగా విజయం సాధించిన గల్లా జయదేవ్... ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమని, ఆయన కోసం తను పర్యటించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.