చీలికల్లేవ్... పేలికల్లేవ్... అంతా మాయిష్టం : మెగా ఫ్యాన్స్!!

గురువారం, 27 మార్చి 2014 (15:52 IST)
File
FILE
రాజకీయపరంగా తామెప్పుడూ కేంద్ర మంత్రి చిరంజీవితోనే ఉంటామని, కుటుంబ పరంగా మాత్రం హీరో పవన్ కళ్యాణ్‌కు మద్దతిస్తామని రాష్ట్ర చిరంజీవి యువత, రామ్ చరణ్ యువత సభ్యులు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ పెట్టిన నేపథ్యంలో వారు ఈ ప్రకటన చేశారు.

రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు గురువారం హైదరాదబాద్‌లో జరిగాయి. ఫిల్మ్ నగర్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వద్ద నిర్వహించిన ఓ కార్యక్రమంలో వీరంతా పాల్గొని ప్రసంగించారు. ఈ పుట్టినరోజు వేడుకలకు రాష్ట్ర చిరంజీవి యువత, రాష్ట్ర రామ్ చరణ్ యువత సంఘాలకు చెందిన సభ్యులు భారీగా హాజరయ్యారు.

పవనప్ కళ్యాణ్ గురించి వారు మాట్లాడుతూ ఒక నటుడిగా, చిరంజీవి కుటుంబానికి చెందిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్‌ను అభిమానిస్తాం. కానీ రాజకీయంగా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలను ఎట్టిపరిస్థితుల్లో సమర్థించబోమని, తాము ఇప్పుడు, ఎప్పుడూ చిరంజీవి వెన్నంటే ఉంటామని తేల్చిచెప్పారు.

వెబ్దునియా పై చదవండి