నగ్మాను తాకిన యూత్ చెంప ఛెళ్లు... మరి ఎమ్మెల్యే ముద్దెడితే...
శుక్రవారం, 28 మార్చి 2014 (12:17 IST)
FILE
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని రఫ్ ఆడించిన ప్రముఖ నటి, ప్రస్తుతం మీరట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ లోకసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నగ్మా గురువారం ఓ యువకుడి చెంపను ఎడాపెడా వాయించేశారు. ఎన్నికలు 2014లో గెలిచేందుకు గాను మీరట్లో ఎన్నికల ర్యాలీ చేపట్టిన నగ్మా నడుమును ఓ యువకుడు తాకాడు. యువకుడు చేయి తగలగానే ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో నగ్మా వెంటనే అతడి చెంపపై వాయించేసింది.
ఐతే యువకుడికి లెంపకాయలు ఇవ్వడాన్ని చూసిన జనం ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. కాగా నగ్మా ఉత్తర ప్రదేశ్ మీరట్ నుంచి కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలావుంటే ఈమధ్యనే హపూర్ శాసనసభ్యుడు గజరాజ్ సింగ్ నగ్మాను ముద్దు పెట్టుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఐతే దానిని నగ్మా సీరియస్ గా తీసుకోలేదు. కానీ యువకుడు తాకినందుకు లెంపకాయలిచ్చేసింది.