ప్రస్తుతం పవన్ రాజకీయ పార్టీ పెట్టి సమాజాన్ని మార్చాలని ప్రకటిస్తే... ఇండస్ట్రీలో కొంతమంది పవన్ కళ్యాణ్ ఏమైనా దేవుడా? అంటూ సెటైర్లు వేసుకుంటున్నారు. ఎలాగూ ఆయన దేవుడు పాత్రలో కన్పించబోతున్నాడు. అందులోనే సమాజాన్ని ఆచారాల్ని మూఢనమ్మకాల్ని కడిగేయాలనుకుంటున్నాడు. బాలీవుడ్ ఓ మైగాడ్‌కు రీమేక్ చేస్తున్నారు. దీనికి ఓరి దేవుడా అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నాడు. వెంకటేష్ కూడా నటించనున్నాడు.
అయితే గతంలో మురళీకృష్ణంరాజు అనే నిర్మాత పవన్‌ను.. ఏసుక్రీస్తుగా చూపించాలని ప్రయత్నించాడు. దానికోసం విదేశాలకు వెళ్లి పవన్‌కు గెటప్‌లు వేయించాడు. కానీ అందులో ఆయన సూట్ కాలేదు. లక్షలు ఖర్చు చేసి వృధా ప్రయాసగా మారింది. ఆ అనుభవాలను ఇప్పుడు నేర్చుకోవాలని ఇండస్ట్రీలో సెటైరిక్‌గా వార్తలు విన్పిస్తున్నాయి.