లోక్‌సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ సోమవారం తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇందులో రామమందిర నిర్మాణం, దేశ ఆర్థికాభివృద్ధి, దళితులు, మైనార్టీ వర్గాల ప్రజల అభివృద్ధి, ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం తదితర అంశాలను పొందుపరిచారు. ఈ మేనిఫెస్టోను పార్టీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ నేతృత్వంలోని 17 మంది సభ్యులు కలిగిన కమిటీ తయారు చేసింది. ఇందులోని కొన్ని ముఖ్యాంశాలు.
* ఎన్నికల్లో బీజేపీ నినాదాలు: 'ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్', 'సబ్ కా సాథ్ సబ్ కా వికాస్'. * అవినీతి నిర్మూలన, నల్లధనాన్ని అరికట్టడానికి పెద్దపీట. * అందరికీ ఆహార భద్రత కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక. * వ్యవస్థలో మార్పులు, పాలనలో పారదర్శకత. * మరిన్ని ఎన్నికల సంస్కరణలను తీసుకువస్తాం. * చట్ట పరిధిలో రామాలయ పునర్నిర్మాణం. * మహిళల భద్రతకు ప్రత్యేక పోలీసు విభాగం.
* ఈ గవర్నెన్స్ కు పెద్దపీట. * బ్రాండ్ ఇండియాను నిర్మిస్తాం. * ఉపాధి కల్పనకు ప్రాధాన్యత. * దళితుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు. * మల్టీ బ్రాండ్ రీటెయిల్ వ్యాపారంలో ఎఫ్‌డీఐలను అనుమతించం. * వెనుకబడ్డ రాష్ట్రాలను ప్రత్యేక ప్యాకేజీల ద్వారా అభివృద్ధి చేస్తాం. * సరళతరమైన పన్నుల విధానాన్ని తీసుకొస్తాం. * వ్యవసాయ భూములకు సాగునీటి కల్పన, ప్రతి గ్రామానికి సురక్షిత మంచినీరు. * గ్రామీణ ప్రాంతాలకు వైఫై (ఇంటర్నెట్) సదుపాయం. * పోలీసు, న్యాయ వ్యవస్థలో సంస్కరణలు. కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు. * పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గిస్తాం. * తీవ్రవాద నిరోధానికి ప్రత్యేక యంత్రాంగం.
* దేశవ్యాప్తంగా గ్యాస్ గ్రిడ్ ఏర్పాటు. * ప్రజారోగ్యం కోసం కొత్త పాలసీ. ప్రతి రాష్ట్రంలో ఎయిమ్స్ స్థాయి ఆసుపత్రి. * టూరిజం అభివృద్ధి కోసం కొత్తగా 50 టూరిస్ట్ సర్య్కూట్స్ ఏర్పాటు. * అన్ని వర్గాలకు సమానంగా ముస్లింలకు అవకాశాలు. మదర్సాల అభివృద్ధికి కొత్త పథకం. * పీవోకేలో ఉన్న శరణార్థుల డిమాండ్లను అంతర్జాతీయ వేదికలపై చర్చిస్తాం. * పారిశుద్ధ్య కార్మిక (స్కావెంజర్స్) వ్యవస్థ పూర్తిగా నిర్మూలం. * వికలాంగుల సంరక్షణకు ప్రత్యేక పథకాలు. * విదేశాల్లోని నల్లధనం వెనక్కి రప్పించేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు. * హిమాలయాల అభివృద్ధికి ప్రత్యేక నిధి. * సామానత్వాన్ని సాధించేందుకు ఉమ్మడి పౌర స్మృతి. * దేశ అభివృద్ధి కోసం నూతన వైజ్ఞానిక ఆవిష్కరణ.