"అరవింద సమేత.." చిత్రానికి ముఖ్యఅతిథిగా 'మెగాస్టార్'.. బాలయ్య సంగతేంటి?

మంగళవారం, 11 సెప్టెంబరు 2018 (14:55 IST)
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "అరవింద సమేత వీరరాఘవ". ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దసరా పండుగను పురస్కరించుకుని వచ్చే నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అందుకే తన తండ్రిని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ ఈ చిత్రాన్ని అనుకున్న సమయానికే విడుదల చేయాలన్న పట్టుదలతో జూనియర్ ఎన్టీఆర్ సైతం షూటింగ్‌కు హాజరవుతున్నారు.
 
ఈ నేపథ్యంలో ఈనెల 20వ తేదీన ఈ చిత్రం ఆడియో వేడుక జరుగనుంది. హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్ వేదికకానుంది. అయితే, ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా యువరత్న బాలకృష్ణ లేదా ప్రిన్స్ మహేష్ బాబులలో ఒకరు హాజరవుతారన్న ప్రచారం జోరుగా సాగింది. కానీ, ఇపుడు సరికొత్త పేరు తెరపైకి వచ్చింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ ఊహించ‌ని అతిథిగా అర‌వింద స‌మేత ఆడియో వేడుక కార్య‌క్ర‌మానికి హాజరు కానున్నారనే ప్రచారం సాగుతోంది. 
 
ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ అత్యంత కీలక పోషించినట్టు ఫిల్మ్ వర్గాల సమాచారం. ఈ విషయాన్ని సినిమా విడుదలయ్యేంత వరకు అత్యంత రహస్యంగా ఉంచాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అందుకే ఈ చిత్రం ఆడియో కార్యక్రమానికి అమితాబ్‌నే ఆహ్వానించినట్టు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియ‌క అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సిరివెన్నెల, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. తమన్ అందించిన సంగీతం అందించగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు