గ్లిజరిన్, ఆముదం సమపాళ్ళల్లో కలిపి ఈ మిశ్రమాన్ని కనురెప్పలకు పట్టించాలి. అయితే ఇది కళ్ళల్లోకి వెళ్ళకుండా చూసుకోవాలి. పొరపాటున వెళ్ళిన నాలుగయిదుసార్లు కళ్ళను చల్లని నీటితో కడుక్కోవాలి. ఈ మిశ్రమం వలన కనురెప్పలు దట్టంగా పెరుగుతాయి.
మస్కారాని అరుదుగా వాడడం మంచిది. మస్కారా వేసుకున్న తర్వాత దాన్ని తీసేయకుండా పడుకోకూడదు. బేబీ ఆయిల్‌తో దూది ముంచి జాగ్రత్తగా మస్కారాను తుడవడం మంచిది. ఇవి చేసే ఓపిక, తీరిక లేకపోతే మార్కెట్లో లభించే అర్టిఫిషియల్ రెప్పలు ఉపయోగించడమే మార్గం. వీటిని జాగ్రత్తగా అతికించిన తరువాత మీకున్న రెప్పలతో అవి కలిసిపోయే విధంగా మస్కారా వేయాలి.