నడుము అందంగా కనిపించాలంటే.. ఏం చేయాలి..?

బుధవారం, 19 డిశెంబరు 2018 (18:31 IST)
సాధారణంగా మహిళలు తమ నడుం చుట్టుకొలత పెరిగిపోతోందని తెగ బాధపడుతుంటారు. ప్రతి ఒక్కరూ నాజూగ్గా కనపడాలని సతమతమవుతుంటారు. అలాంటి వారికి కొన్ని ఉపాయాలు...
 
నడుమును నాజూగ్గా ఉంచాలంటే.. దీనికి మీరు చేయవలసిందల్లా ఒక్కటే.. వీలైనంతమేర అత్యధికంగా కూరగాయలను ఆహారంగా తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. వారానికి 19 సార్లు మీ భోజనంలో కూరగాయలను ఆహారంగా తీసుకుంటే నడుం మీరు కోరుకున్న విధంగా ఉంటుంది.
 
ఆలోచనలు, దిగులు, బాధ వీటి వలన ఒత్తిడి పెరిగిపోతుంది. దీంతో నడుం చుట్టుకొలత విపరీతంగా పెరిగి చూడడానికి బాగుండదు. నడుం చుట్టు కొలతలపై జరిపిన పరిశోధనల్లో మానసిక ఒత్తిడి ప్రధాన పాత్ర పోషిస్తుందని ఇటివలే ఓ పరిశోధనలో పేర్కొన్నారు. 
 
ముఖ్యంగా ఎవరి నడుమైతే మరీ సన్నగా ఉంటుందో అలాంటివారికి ఈ సమస్య అధికంగా ఉంటుందని, అందువలన వారు అత్యధిక ఒత్తిడికి లోనవుతున్నారు తెలియజేశారు. వారి శరీరంలో కీర్టీసాల్ అనే హార్మోన్ అత్యధికంగా విడుదలైనప్పుడు వారి నడుము అందాన్ని కోల్పోతుందని పరిశోధనల్లో తేలినట్లు వివరించారు. 
 
వీలైనంత వరకు కూరగాయలను వాడితే నడుము నాజూగ్గా ఉంటుంది. ఎందుకంటే కాయగూరల్లో ఫైబర్ అత్యధిక శాతం ఉంటుంది. ఇది జీర్ణక్రియకు దోహదపడుతుందని వారు వివరించారు. ఇదే కాకుండా ప్రతిరోజూ వాకింగ్ చేయండి. వారానికి ఒకసారి జాగింగ్ చేయండి. విటమిన్ ఈ కి చెందిన మాత్రలను వాడండి. వీటిని నిత్యం వాడితే శరీర బరువు పెరగడాన్ని నిరోధిస్తుందని పరిశోధకులు తెలిపారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు