పరీక్షా సమయంలో ఎనర్జీ లెవెల్స్‌ను పెంచే "సూప్"

FILE
పరీక్షల సమయంలో ఆకలి ఎక్కువగా ఉందని ఒకేసారి ఆహారం తీసుకున్నట్లయితే మానసికంగా, శారీరకంగా చురుకుదనం తగ్గిపోతుంది. అందుకే పరీక్షల సమయంలో పిల్లలకు ఎక్కువ పోషకాలు ఉండే తేలికపాటి ఆహారం ఇవ్వటం చాలా అవసరం. పోషకాలను సమృద్ధిగా అందించటమేగాకుండా, ఎనర్జీ లెవెల్స్‌ను పెంచే ఈ సూప్‌ను తప్పకుండా మీ చిన్నారులకి ఇవ్వండి.

కావలసిన పదార్థాలు :
పచ్చిబఠాణీలు.. నాలుగు కప్పులు
స్వీట్‌కార్న్.. రెండు కప్పులు
ఉల్లిపాయ తరుగు.. ఒకగడ్డది
మెదిపిన వెల్లుల్లి రెబ్బలు.. కాసిన్ని
నూనె.. రెండు టీ.
వెన్నలేని పాలు.. అర కప్పు
కొత్తిమీర తరుగు.. రెండు టీ.
పుదీనా తరుగు.. రెండు టీ.

తయారీ విధానం:
పచ్చి బఠాణీలు, మొక్కజొన్న, కాస్తంత ఉప్పు, ఆరు కప్పుల నీళ్లు కలిపి సన్నటి మంటపై పది నిమిషాలపాటు ఉడికించాలి. చల్లారిన తరువాత మిక్సర్‌లో వేసి బ్లెండ్ చేయాలి. దీంట్లోనే పాలు, కొత్తిమీర, పుదీనా వేసి మళ్లీ స్టవ్‌పై పెట్టి కాసేపు ఉడికించి, దించి సర్వింగ్ బౌల్స్‌లో పోసి సర్వ్ చేయాలి. అంతే వేడి వేడి సూప్ తయార్..! ఇందులోని పోషకాలు తక్షణ శక్తిని అందించటమేగాకుండా, పిల్లల మెదడు చురుగ్గా ఉండేలా చేస్తాయి. దీంతో పరీక్షలు కూడా చక్కగా రాస్తారు.

వెబ్దునియా పై చదవండి