Viral Video అవార్డు ప్రదానం చేసి నటి మావ్రాను ఎర్రిమొహం వేసి చూసిన పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్

ఐవీఆర్

గురువారం, 29 మే 2025 (13:06 IST)
పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌కు సంబంధించి ఓ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతగా ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవడానికి కారణం లేకపోలేదు. సినిమా నటీనటులకు అవార్డులు ప్రదానం చేసిన కార్యక్రమంలో షెహబాజ్ షరీఫ్ చూసిన చూపులే ఇందుకు కారణం.
 

Apparently Shehbaz Sharif is not that Sharif pic.twitter.com/RzzitJgJlI

— Cabinet Minister, Ministry of Memes,???????? (@memenist_) May 28, 2025
అసలు విషయం ఏంటంటే... పాకిస్తాన్ నటి మావ్రా హోకేన్‌కు అవార్డు ప్రదానం చేసారు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. ఈ అవార్డు ప్రదానం 2023లో జరిగింది. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సిలో గవర్నర్ హౌసులో జరిగిన ఈ అవార్డు ప్రదానోత్సవంలో పాక్ ప్రధాని చేతుల మీదుగా అవార్డు అందుకున్నది నటి మావ్రా హోకెన్.
 
ఆ తర్వాత ఆమె అక్కడి నుంచి వెళ్తుండగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆమె వెనుక వైపు భాగాన్ని ఎర్రిమొహం వేసుకుని చూస్తూ కనిపించాడు. ఈ దృశ్యాన్ని వీడియో ద్వారా పోస్ట్ చేస్తూ అక్కడి యూన్యూస్ టీవీ ఓ ట్యాగ్ లైన్ పెట్టింది. అదేంటంటే... నటి మావ్రాను ప్రధాని షెహబాజ్ షరీఫ్ డీప్ స్కాన్ చేస్తున్నారంటూ పేర్కొంది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు