బేబీ కార్న్‌ బజ్జీలు ఎలా చేయాలో చూద్దాం...

మంగళవారం, 14 ఆగస్టు 2018 (13:07 IST)
కావలసిన పదార్థాలు:
బేబీ కార్న్ - 10 
మెుక్కజొన్న పిండి - 5 స్పూన్స్
మైదాపిండి - 5 స్పూన్స్
పచ్చిమిర్చి - 4
వెల్లుల్లి రెబ్బలు - 6
అల్లం - చిక్క ముక్క
కొత్తిమీర తరుగు - అరకప్పు
ఉప్పు - తగినంతా
నూనె - సరిపడా
 
తయారీ విధానం:
ముందుగా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చీలను మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు బేబీ కార్న్‌‌లను రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్‌లో ముందుగా తయారుచేసుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసుకుని ఆ తరువాత ఉప్పు, మెుక్కజొన్న పిండి, మైదాపిండి, కొత్తిమీర తరుగును వేసుకుని కొద్దిగా కొద్దిగా నీటిని పోసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనెను పోసి వేడయ్యాక బేబీ కార్న్‌లను ఆ మిశ్రమంలో ముంచి నూనెలో వేయించుకోవాలి. అంతే... వేడివేడి బేబీ కార్న్ బజ్జీలు రెడీ.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు