విదేశీయులు బ్రొకోలీగా పిలుచుకొనే ఈ కాలీఫ్లవర్‌లో పోషకాలు, విటమిన్ ఎ, యాంటి ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. క్యాన్సర్‌ను నివారణకు క్యాలీఫ్లవర్‌ను ఎక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చూచిస్తున్నారు. క్యాలీఫ్లవర్‌లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌లు, విటమిన్ సి ఉండటం ద్వారా ఇది నాడీ వ్యవస్థను ఆరోగ్యకరంగా ఉంచుతుంది. మరి ఇటువంటి కాలీఫ్లవర్‌తో మంచూరియా ఎలా తయారుచేయాలో చూద్దాం.
ముందుగా మైదాపిండిలో కాన్‌ఫ్లోర్, కారం, ఉప్పు, మిరయాలు, నీళ్లను వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కాలీఫ్లవర్ ముక్కలు ముంచి నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత టమాట, చిల్లీ, సోయా సాస్‌లు అజినమెుటో వేసి బాగు కలుపుకోవాలి. చివరగా వేయించిన కాలీఫ్లవర్ ముక్కలు వేసి కలుపుకుంటే మంచూరియా రెడీ.